Tuesday, November 5, 2024

లిక్కర్ కేసులో ఇడి ట్విస్ట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: లిక్కర్ స్కాంలో మరో ఊహించని కీలక పరిణామం చోటుచేసుకుంది. కవిత సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్‌పై ఈడీ అధికారుల్లో గుబులు రేపుతోంది. తాము చేసింది తప్పనీ తెలుసుకున్న ఈడీ అధికారులు కవిత వేసిన పిటీషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సుప్రీంకోర్టులో కేవియట్ పిటీషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

అయితే మహిళా హక్కుల గురించి పిటీషన్‌లో కవిత పేర్కొంటూ కీలక అంశాలను అందులో ప్రస్తావించింది. తనను రాత్రి 8 గంటల నిమిషాల వరకు ఈడీ కార్యాలయంలో కూర్చొబెట్టడాన్ని కవిత సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సూర్యాస్తమం తర్వాత మహిళను విచారణ కోసం కార్యాలయంలో కూర్చోబెట్టకూడదని చట్టం చెబుతోందని కవిత ఆ పిటీషన్‌లో పేర్కొంది. ఒక మహిళను కార్యాలయానికి పిలిపించి విచారించవద్దని కవిత పిటీషన్ దాఖలు చేసింది. తమ వాదన వినేంతవరకు కవిత పిటీషన్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని ఈడీ సుప్రీంకోర్టును హడావిడిగా అభ్యర్థించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News