Monday, December 23, 2024

త్వరలో ఆప్ మంత్రిని అరెస్టు చేస్తారు: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ… ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేందర్ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. జైన్‌ను ఈడీ అరెస్టు చేయనున్నట్టు తెలిసింది. ఆయన ఆస్తులపై కేంద్ర ప్రభుత్వం గతం లోనూ రెండుసార్లు దాడులు చేయించినా ఏం దొరకలేదు. ఈడీ అధికారులు మళ్లీ రావాలనుకుంటే వారికి స్వాగతం అని అన్నారు. ఈ దాడులన్నీ రాజకీయ ప్రేరితమేనని ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి అంచున ఉన్నప్పుడల్లా బిజెపి … ప్రభుత్వ ఏజెన్సీలను ప్రయోగిస్తుందని విమర్శించారు. ఇటీవల పంజాబ్ సిఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనల్లుడిపై ఈడీ దాడులను ప్రస్తావిస్తూ ఈ విషయంలో మేం చన్నీలా చేయం. ఆయన తప్పు చేసి దొరికి పోయారు. కాబట్టే భయపడుతున్నారు. ఆ దాడుల్లో పట్టుబడిన నగదు చూసి పంజాబ్ ప్రజలే షాక్ అయ్యారు. కానీ మాకు ఆ భయం లేదు. సత్యేందర్ జైన్ ఎందుకు? అధికారులను మా ఇంటికి, భగవంత్ మాన్ (ఆప్ పంజాబ్ సీఎం అభ్యర్థి) ఇంటికి పంపండి అని కేజ్రీవాల్ సవాల్ విసిరారు. అయితే జైన్‌ను ఏ కేసు విషయంలో ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉందో కేజ్రీవాల్ వెల్లడించలేదు.

ED will arrest Delhi Minister Satyender Jain: Kejriwal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News