Monday, December 23, 2024

జులై 26న ఎడ్‌సెట్

- Advertisement -
- Advertisement -

EdCET test on July 26th

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రెండేళ్ల బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బి.ఇడి) కోర్సులో ప్రవేశాలకు మంగళవారం(జులై 26) ఎడ్‌సెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ ఎ.రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకు రెండో సెషన్, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మూడో సెషన్‌లలో ఎడ్‌సెట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 38,091 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్, విజయవాడ సహా తెలంగాణలో 39 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, గంటన్నర ముందు నుంచే పరీక్షా కేంద్రాలలోకి అనుమతిస్తామని తెలిపారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News