Thursday, January 23, 2025

ఎడెల్విస్ టోక్యో లైఫ్ నుంచి రిస్క్ మేనేజ్మెంట్ పద్ధతులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వ్యాపార నాణ్యతను బలోపేతం చేయటానికి ఎడెల్విస్ టోక్యో లైఫ్ మోసపూరిత పద్ధతులను ముందుగానే కనుగొనడం, నివారించే కొత్త రిస్క్ మేనేజ్మెంట్ పద్ధతులను ప్రవేశపెట్టింది. కంపెనీ ఎగ్సిక్యూటివ్ డైరెక్టర్ సుబ్రజీత్ ముఖోపాధ్యాయ్ మాట్లాడుతూ, మోసపూరిత సంఘటనలు కేవలం వ్యాపారానికి మాత్రమే కాకుండా వినియోగదారుడికి కూడా హానికరమైనవే అని అన్నారు.

ఇవి ఉత్పత్తి ధరలు, బోనస్ పేఅవుట్స్, క్లెయిమ్ సెటిల్మెంట్, మరెన్నో అంశాలపై ప్రభావం చూపుతాయి. ఒక సంస్థగా మోసాలను ఎదుర్కొనే ప్రయత్నాలలో భాగంగా వినియోగదారులకు కొత్త ఉత్పత్తులు, సేవలను అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. రిస్క్ మేనేజ్మెంట్ పద్ధతుల కోసం కేవలం ఇన్సూరర్ మాత్రమే ప్రతిష్ఠాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డ్ 2023ను అందుకుంటారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News