Thursday, January 23, 2025

కోహ్లీ బర్త్ డేకు ఈడెన్ ముస్తాబు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: రికార్డుల రారాజు, టీమిండియా మాజీమ సారధి విరాట్ కోహ్లీ స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో తనదైన శైలిలో రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా.. నవంబర్ 5న కోహ్లీ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఈసారి అతడి పుట్టిన రోజున భారత-సౌతాఫ్రికా తలపడనున్నాయి.

ఈడెన్ గార్డెన్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. దీంతో కోహ్లీ పుట్టిన రోజును పురస్కరించుకుని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 35వ పుట్టిన రోజు కోహ్లీకి ప్రత్యేకంగా గుర్తుండి పోయేలా ముస్తాబు చేస్తున్నారట. ఇప్పటికే కోహ్లీ కోసం ప్రత్యేకంగా కేక్‌ను సిద్ధం చేస్తున్నారని స్పోర్ట్స్ టుడే వెల్లడించింది. క్యాబ్ అధ్యక్షుడు స్నేహాశిష్ గంగూలీ ఈ విషయాన్ని దృవీకరించినట్లు తెలిపింది.

’విరాట్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం. ఇందుకు కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కోహ్లీ కోసం ఓ ప్రత్యేక కేక్‌ను కూడా తయారు చేయిస్తున్నాం. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇప్పుడే అభిమానులకు చూపించలేము. ఇక మ్యాచ్ జరిగే సమయంలో ఇన్నింగ్స్ విరామ సమయంలో స్టేడియంలో లైటింగ్ షో, ఫైర్ వరక్స్ ఏర్పాట్లు చేశాం. దాదాపు 70 వేల కోహ్లీ ఫేస్ మాస్కులను అందించబోతున్నాం.’ అని స్నేహాశిష్ చెప్పాడు.

ఇదిలా ఉంటే.. వన్డేల్లో విరాట్ కోహ్లీ 48 సెంచరీలు చేసి ఈ ఫార్మాట్‌లో అత్యధిక శతకాలు బాదిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 49 వన్డే శతకాల రికార్డును కోహ్లీ ఈ ప్రపంచకప్‌లోనే బ్రేక్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News