Sunday, February 23, 2025

ఫరూఖ్ అబ్దుల్లాకు ఇడి సమన్లు..

- Advertisement -
- Advertisement -

జమ్మూ : క్రికెట్ కుంభకోణం సందర్భంగా జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత డాక్టర్ ఫరూఖ్ అబ్దుల్లాను మంగళవారం తమ ముందు హాజరు కావలసిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) పిలిచింది. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాను ప్రశ్నించేందుకు శ్రీనగర్‌లోని ఇడి కార్యాలయానికి పిలవడమైంది. ఇదే కేసులో జనవరి 11న దర్యాప్తు సంస్థ ఇడి సమన్లను బేఖాతరు చేశారు. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ సంఘం (జెకెసిఎ)లో అవినీతి ఆరోపణలపై ఇడి దర్యాప్తు సందర్భంగా ఫరూఖ్ అబ్దుల్లాకు సమన్లు జారీ అయ్యాయి. శ్రీనగర్ లోక్‌సభ సీటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫరూఖ్ అబ్దుల్లాపై 2022లో ఇడి లాంఛనంగా అభియోగాలు నమోదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News