Wednesday, January 22, 2025

ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల దరఖాస్తులకు ఎడిట్ అవకాశం: టిఎస్‌పిఎస్సీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్‌పిఎస్సీ ఫిజికల్ డైరెక్టర్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ డైరెక్టర్ ఇన్ ఇంటర్ ఎడ్యుకేషన్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తప్పుగా నమోదు చేసి డాటాను సరిచేయడానికి ఎడిట్ అవకాశం కల్పించింది. నేటి నుంచి ఈనెల 4వ తేదీ వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపింది. అభ్యర్థులకు ఇదే చివరి అవకాశమని జాగ్రత్తగా డేటా సవరణ చేసుకోవాలని పేర్కొంది. అభ్యర్థులు వారి బయో-డేటా ఇతర వాటిని చూడాలని సూచించింది. పిడిఎఫ్‌లో అందుబాటులో ఉంచబడిన, తప్పు సరిదిద్దబడిన వివరాలు,  దరఖాస్తులో నమోదు చేసిన డేటాను సరిచూసుకోవాలని వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News