Monday, January 20, 2025

ప్రముఖ ఎడిటర్ కృష్ణారావు కన్నుమూత

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ప్రముఖ సినిమా ఎడిటర్, నిర్మాత జిజి కృష్ణారావు మంగళవారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో కృష్ణారావు తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు, సాగర సంగమం, స్వాతిముత్యం, శుభలేక వంటి సినిమాలకు ఆయన ఎడిటర్‌గా సేవలందించారు. దివంగత డైరెక్టర్ కె విశ్వనాథ్, దాసరి నారాయణ రావుతో కృష్ణారావు మంచి అనుబంధం ఉంది. ఆయన 200 సినిమాలకు పైగా ఎడిటింగ్‌లో పలుపంచుకున్నారు. టాలీవుడ్ లో ప్రముఖులు రోజు కొకరు చనిపోతుండడంతో ఫిల్మ్ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News