Monday, December 23, 2024

రాజకీయ ఆధ్యాత్మికత

- Advertisement -
- Advertisement -

పశువును మనిషిగా, మనిషిని దేవునిగా మార్చే ఆలోచనే మతం. మంచిగా మెలిగి, మంచి చేయడమే మతం. శాంతి సాధన మత ప్రాథమిక లక్ష్యం. తోటి మనిషిని గౌరవించలేనివాడు కనిపించని దేవున్ని పూజించగలడా?’ స్వామి వివేకానంద. ‘ఒకరు మరొకరిని (మతాన్ని) మార్చడాన్ని నమ్మను. ఇతరుల విశ్వాసాలు కించపర్చకుండా వారు ఆ మార్గాన్ని బాగా ఆచరించడానికే యత్నిస్తాను’ మహాత్మా గాంధీ. నేడు రాజ్య మత సంస్కృతి, కుల మత వివక్షత, మతోన్మాదం పెరిగాయి. సంఘ్ మతవైఖరి రాజ్యాంగ విరుద్ధం. అమానవీయ ఆచారాలకు దేవునికి సంబంధం లేదు. ఇవి మానవత్వం, హృదయం లేని మానసిక వికారులు, దైవ భావన, మత అవగాహన లేని దానవుల దుశ్చర్యలు. శాంతి కార్యకర్త రోమన్ కాథలిక్ పూజారి ఫాదర్ రాయ్ బూర్జివాయిస్ వ్యాఖ్యానించారు.

“పాలక వర్గాలు శ్రామిక వర్గాలకు ఇచ్చే నల్ల (మత్తు) మందే మతం. తమ ఆర్థిక అధోగతికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పాటించే నిరసన విధానం. మతం మానవాభివృద్ధిని మందగింపజేస్తుంది. హృదయం లేని ప్రపంచపు హృదయం. బాధలనుభవించే ప్రజా బాహుళ్యానికి బాధా నివారిణి” మార్క్. ‘మతం సామాన్యులకు సత్యం. విజ్ఞులకు అసత్యం. పాలకులకు ప్రయోజనకరం’ రోమ్ తత్వవేత్త, రచయిత, రాజనీతిజ్ఞుడు లూసియస్ అనాయస్ సెనెకా.
మత విశ్వాసం శ్రామిక ప్రజలపై పట్టు సాధించలేదని మార్క్, ఏంగెల్స్ నమ్మేవారు. పండుగల్లో మతాలయాలు కిక్కిరిసిపోతాయి. దీక్షాభక్తులు పెరిగారు. ఆదివారాల్లో చర్చీలు నిండుతాయి. చైతన్య సభలు ఖాళీ. మార్క్, ఏంగెల్స్ నమ్మకం వమ్మయిందా? ప్రజలపై మతపట్టు బిగిసిందా? ‘శాస్త్రీయతా లోపం ఉద్రేకాలను పెంచింది. మతాలు ఉన్మాదాలుగా మారాయి. ద్వేషదుర్మార్గాలకు మత ముసుగు కప్పి, ప్రత్యేక మతమత్తు ఎక్కిస్తే అరాచకమే. రాజకీయుల ఈ లక్షణాలు అతి నీచమైన పాత్రను పోషిస్తున్నాయి. పశువును మనిషిగా, మనిషిని దేవునిగా మార్చే ఆలోచనే మతం. మంచిగా మెలిగి, మంచి చేయడమే మతం. శాంతి సాధన మత ప్రాథమిక లక్ష్యం.
తోటి మనిషిని గౌరవించలేనివాడు కనిపించని దేవున్ని పూజించగలడా?’ స్వామి వివేకానంద. ‘ఒకరు మరొకరిని (మతాన్ని) మార్చడాన్ని నమ్మను. ఇతరుల విశ్వాసాలు కించపర్చకుండా వారు ఆ మార్గాన్ని బాగా ఆచరించడానికే యత్నిస్తాను’ మహాత్మా గాంధీ. నేడు రాజ్య మత సంస్కృతి, కుల మత వివక్షత, మతోన్మాదం పెరిగాయి. సంఘ్ మతవైఖరి రాజ్యాంగ విరుద్ధం. అమానవీయ ఆచారాలకు దేవునికి సంబంధం లేదు. ఇవి మానవత్వం, హృదయం లేని మానసిక వికారులు, దైవ భావన, మత అవగాహన లేని దానవుల దుశ్చర్యలు. శాంతి కార్యకర్త రోమన్ కాథలిక్ పూజారి ఫాదర్ రాయ్ బూర్జివాయిస్ వ్యాఖ్యానించారు. ఉద్యోగాలు లేవు. క్షీణించిన శ్రమ సంస్కృతి, శారీరక శ్రమ ఉపాధులను అస్పృశ్యం చేసింది. విజ్ఞాన శాస్త్రం పెరిగినా చదువరులలో అశాస్త్రాలను విశ్లేషించే, ప్రశ్నించే విజ్ఞత లోపించింది. మిథ్యా జ్ఞాన ఆంగ్లీకరణ చదువరులు యువతకు ఆదర్శమయ్యారు. సమస్యల వలయంలో నిరాశ చెందిన యువత మతానికి మళ్ళింది. మతం పెట్టుబడి అక్కరలేని మంచి వ్యాపారం. సంపద, సుఖసంతోషాలను ఖర్చు లేకుండా సులభంగా పొందవచ్చు. పుణ్యపాపాల, స్వర్గ నరకాల, ముక్తి మార్గాల, కర్మ సిద్ధాంతం, మాయ మాటలతో అణగారిన వర్గాల దోపిడీకి అగ్రవర్ణాల పన్నాగమే మతం. అది మనుషులను మత్తుల్లో ముంచి విచక్షణాజ్ఞానాన్ని, ప్రశ్నించే తత్వాన్ని రూపు మాపుతుంది. వ్యాపారీకరించబడిన విద్య ఆంగ్లం మాట్లాడే, కంప్యూటర్లతో ఆట్లాడే ఆధునిక మత ఛాందసులను తయారు చేసింది. వీరే మత సేవల వ్యాపారులు.
యోగా గురువులు, బాబాలు యువతను వలలో వేసుకుంటున్నారు. లాభసాటి మత యాత్రల మార్కెట్ పెరిగింది. దేవాలయాల, ఆశ్రమాల, తీర్థయాత్రా కేంద్రాల ఏర్పాటులో, ప్రచారంలో ప్రజా ధనం ఆవిరవుతోంది. గురుకుల, రుషి, వైదిక పాఠశాలల విస్ఫోటనం జరిగింది. అన్ని కులాల పిల్లల భావజాలం మారింది. 12 ఏండ్లు సంస్కృత మంత్రాలతో పూజలు, యజ్ఞాలు చేయడం నేర్చుకున్న వీరు సిద్ధాంతులుగా సమాజానికి మత క్రమశిక్షణ నేర్పి, ఆధ్యాత్మిక అవసరాలు తీర్చి పొట్ట పోసుకుంటారు. మత ఛాందస, మూఢ విశ్వాసాలలో పట్టాలు పొందిన వేల కొలది విద్యార్థులు సమాజాన్ని సర్వ నాశనం చేస్తున్నారు. మతాంధతతో మూఢ నమ్మకాలు పెరిగాయి. వాస్తు- ఇళ్ళు కడుతున్నారు. తరతరాలుగా సమస్య లేని ఇళ్ళను కూల్చుతున్నారు. జాతకాలు జీవితాలను మారుస్తున్నాయి. ప్రభుత్వాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెట్టినంత ఖర్చు పరిశోధనలపై పెట్టడం లేదు. ఫలితంగా మనం శాస్త్రీయంగా వెనుకబడి నోబెల్ కు నోచుకోలేదు. బిజెపి ప్రభుత్వంలో అశాస్త్రీయాలు విశ్వవిద్యాలయ అధ్యయన అంశాలయ్యాయి. మోడీయం మతోన్మాదాన్ని పెంచింది. శాస్త్రం, శాస్త్రీయ దృక్పథం, ప్రగతి సన్నగిల్లాయి. మతపాలన, మత సంస్థల “సేవా కార్యాలు” ప్రభుత్వాలను బాధ్యతా రహిహితం చేస్తున్నాయి.
సంఘ్ అనుబంధ ‘ధర్మ జాగరణ మంచ్’ మత మార్పిళ్ళు చేస్తోంది. ‘ముస్లింల, క్రైస్తవుల పూర్వీకులు హిందువులే. అత్యాచారాలు, దాడుల కారణంగా వారు ముస్లింలయ్యారు. మొఘలు చక్రవర్తులు మత మార్పిళ్ళు చేశారు. ‘విశ్వహిందు పరిషత్ అంతర్జాతీయ్ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అన్నారు. బిజెపి పాలనలో సంఘీయులు, ‘ఘర్ వాపసీ’ పేరుతో పర మతస్థులను బలవంతంగా హిందు మతానికి మార్చే ప్రయత్నాలు ముమ్మరంచేశారు. హిందు మతం నుండి మార్పిళ్ళు తగ్గాయి. మత మార్పిళ్ళు సాధారణంగా విశ్వాసాలతో కాక పెళ్ళి కోసమో, ఆర్థిక, సామాజిక ప్రయోజనాల కోసమో జరుగుతాయి. ఇళ్ళే లేని వారికి రేషన్ కార్డులిస్తామని, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని వాగ్దానాలు చేసి, ఆగ్రాలో ముస్లింలను హిందు మతంలో చేర్చారు. రాజు ప్రాపకంలో శ్రమ రహిత సుఖ సౌఖ్యాలు, లబ్ధి పొందడానికి పలు రంగాల ప్రజలు రాచమతంలో చేరేవారు. రాజులు ప్రోత్సహించేవారు.
ముస్లిం, ఆంగ్లేయ పాలనల్లో ఇదే జరిగింది. అక్బర్ చక్రవర్తి మత సామరస్యానికి హిందు యువతులను పెళ్ళాడారని పేర్కొన్నా రాణివాసం కోసం స్త్రీల పెద్దలు ఈ పెళ్ళిళ్ళను ప్రోత్సహించి ఉండవచ్చు. సంఘ్ నాయకుడు మోహన్ భాగవత్, ముస్లింలు, క్రిస్టియన్లు హిందువులేనన్నారు. పర మతాలయాల జాబితా ఇచ్చి ఇవి హిందు గుళ్ళేనన్నారు. ఏ క్షణంలోనైనా వీటిని కూల్చవచ్చు. కాశీ, మధురల్లో ఈ ఎన్నికల గొడవ జరుగుతోంది. హైందవ ప్రవక్త గరికపాటి నరసింహారావు మోడీని భీష్మునితో పోల్చారు. ఫలితం పద్మశ్రీ. పేదల బలవంతపు మత మార్పిళ్ళు, మతమౌఢ్య ఆచరణలు, పురాణ గాథలు యధార్థాలన్న ప్రచారం, సమాజ ప్రయోజకుల హత్యలు వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నది సంఘ్. బాబాలు, అమ్మలు మతమౌఢ్యాన్ని పోషిస్తున్నారు. వీళ్ళ ఓట్లు, నోట్ల కోసం ప్రభుత్వం వీళ్ళను ప్రోత్సహిస్తున్నది.
మతవాదం స్వేచ్ఛా స్వాతంత్రాలు, సమానత్వ సౌభ్రాతృత్వాలు, సహ జీవనం, జీవించే హక్కు, రాజ్యాం గం, సామ్యవాదం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, దేశ సమైక్యతా సమగ్రతలకు ముప్పు. దళిత, మైనారిటీలపై దాడికి, అగ్రవర్ణ ఆధిపత్య పునఃప్రతిష్ఠకు దారితీస్తుంది. మతవాదంతో ఆకలిదప్పులు, నిరుద్యోగ పేదరికాలు, అవిద్య అనారోగ్యాలు, అసమానతా వివక్షలు అశ్రద్ధ చేయబడతాయి. పాపాల ఫలితాలుగా వర్ణించబడతాయి. భిన్నమతస్థులు, రచయితలు, హేతువాదులు, ప్రజాస్వామికవాదులు, తస్మదీయ తాత్వికులను మతోగ్రవాదులు శత్రువులుగా చూస్తారు. వాళ్ళ విష బీజాలే గాంధీ, గోధ్రా, దభోల్కర్, పాన్సరే, కల్బర్గి, గౌరీ లంకేశ్, రోహిత్ వేముల హత్యలకు, పర మతాలయాల కూల్చివేతకు ప్రేరణలు. స్వమత స్త్రీలతో సహా ఆడువారి అణచివేతకు, కులమతాంతర వివాహాల హత్యలకు మూలాలు. దేవుని ముసుగులో మత సేవల అక్రమార్కులను ఉత్తములని పొగడతారు. డేరా బాబాలు ఈ నమూనాలే. ప్రగతికి శాస్త్రీయ దృక్పథం, మానవతా వాదాలు అవసరం. కావున మత సమానత, సామాజిక, లింగ సమానత, మహిళా, మానవత్వ, పౌర, హక్కుల కొరకు పోరాడాలి. అందులో మతాన్ని భాగం చేయాలి. కొద్ది మార్పుతో ప్రయోజనం లేదు. మొత్తం వ్యవస్థ మారాలి. అందుకు మహిళలతో కలిసి విప్లవించాలి. రాజ్యాంగంలో పొందుపరిచిన శాస్త్రీయ దృక్పథాన్ని, లౌకికవాదాన్ని పెంపొందించాలి. దీనికి పాలకులను సమాయత్తపరచాలి. భారతీయులు విద్య, శాస్త్ర సాంకేతిక విజ్ఞానంపై దృష్టి సారించాలని, మత వివాదాలలో కాలం వృథా చేయొద్దని ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత వెంకటరామన్ రామకృష్ణన్ హితవు పలికారు.

సంగిరెడ్డి హనుమంత రెడ్డి
9490204545

Editorial about Cast in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News