- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్: దేశంలో విద్య, వైద్యాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్వహించాలని కోరుతూ మార్చి 2న వేలాది విద్యార్థులతో మహాసమ్మేళనం నిర్వహిస్తున్నట్లు బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరికి అవసరమైన విద్య, వైద్యాన్ని ఉచితంగా ప్రభుత్వాలే నిర్వహించాలన్నారు. కార్పొరేట్ దవాఖానలతో పేదల ఆర్థికంగా చితికిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలతో విద్య భారంగా మారుతోందన్నారు.
- Advertisement -