Monday, December 23, 2024

పాఠశాల విద్యకు రూ. 73,498 కోట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పాఠశాల విద్య, అక్షరాస్యతకు 2024-25 తాత్కాలిక బడ్జెట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా కేటాయింపులు జరిగాయి. పాఠశాల విద్య, ఆక్షరాస్యత మంత్రిత్వశాఖకు తాత్కాలిక బడ్జెట్‌లో రూ.73,498 కోట్లను కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కూడా ఈ బడ్జెట్‌లో గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం గత వార్షిక బడ్జెట్‌లో తొలుత రూ.68,804.85 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల ప్రకారం దాన్ని రూ.73,008 కోట్లకు పెంచింది.

ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా మార్చడానికి ఉద్దేశించ విద్యా శాఖ అమలు చేస్తున్న పిఎం శ్రీ పథకానికి తాత్కాలిక బడ్జెట్‌లో రూ.6,050 కోట్లు కేటాయింపులు జరిగాయి. సమగ్ర శిక్ష అభియాన్, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు వంటి అన్ని ముఖ్యమైన పథకాలకు ఈ ఏడాది కేటాయింపులు పెరిగాయి. పాఠశాల విద్యా శాఖకు ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయింపులు జరగడం ఇదే మొదటిసారని విద్యా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News