Monday, December 23, 2024

ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ పై తనిఖీలు నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట  : ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీపై మండల జిల్లా విద్యాశాఖ అధికారులపై తనిఖీలు నిర్వహించాలని యూఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలోత్ రాజేశ్ డిమాండ్ చేశారు. శనివారం యూఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలో దోపిడీ విచ్చలవిడిగా పెరిగిపోతుందని ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ విద్యా దోపిడీ చేస్తున్నారన్నారు.

జిల్లాలో ఈ టెక్నో, ఇంటర్ నేషనల్ స్కూల్ డిజి స్కూల్ అంటూ తోక పేర్లు పెట్టుకొని విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని అలాగే స్కూల్ బుక్స్, యూనిఫామ్స్ పేరు, అడ్మిషన్ రిజిస్ట్రేషన్ పేరుతో ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి దనార్జనే ధ్యేయంగా వసూళ్లకు పాల్పడుతున్న కార్పొరేట్ స్కూల్‌లపై , జిల్లా అధికారులపై తనిఖీలు నిర్వహించి ఆయా సూళ్ల అనుమతులు రద్దు చేయాలని వారికి వత్తాసు పలుకుతున్న అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కొన్ని మండలాల విద్యాధికారులు పాఠశాల యాజమాన్యాలకు తోత్తుగా వ్యవహరిస్తున్నారని అట్టి విద్యా అధికారులపై విచారణ జరపాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కార్తీక్, ప్రసాద్, హరి, రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News