Friday, November 22, 2024

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  విద్యార్థులకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసి తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ రెండోరోజు విజయవంతంగా కొనసాగింది. వందలాది మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి వచ్చి తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ పేరు సందర్శించి తమ కావాల్సిన కాలేజీలో సమాచారాన్ని గ్రూపుల సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. టి న్యూస్- అపెక్స్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా హైదరాబాద్ లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ 2021ఫెయిర్ నిర్వహించింది. రెండో రోజు అద్భుతమైన స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున విద్యార్థులు తల్లిదండ్రులు ఫెయిర్ కు హాజరై కాలేజీల సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ఇంజనీరింగ్ కోర్సులతో పాటు అన్ని కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పించటం జరిగింది. ప్రధానంగా వెబ్ కౌన్సెలింగ్ లో విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉన్న డౌట్స్ అన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మాక్ ‌వెబ్ కౌన్సిలింగ్ లో నివృత్తి చేసుకున్నారు.

తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. తమకు కావాల్సిన సమాచారాన్నంతా ఒకే చోట సేకరించి ఒక గొప్ప అవకాశం కల్పించిన టీ న్యూస్ కు కృతజ్ఞతలు తెలిపారు. అటు కాలేజీ యాజమాన్యాలు సంతృప్తి వ్యక్తం చేశారు. రెండవ రోజుల పాటు జరిగిన ఎడ్యుకేషన్ ఫెయిర్ లో తమ తమ కాలేజీల  సమాచారం ఇవ్వడంతో పాటు విద్యార్థి ఏ బ్రాంచి ఎంపిక చేసుకుంటుందో భవిష్యత్తులో ఎటువంటి కోర్సులకు డిమాండ్ ఉంటుందో తెలియజేశామని కాలేజీ లెక్చరర్లు తెలిపారు.

అటు వెబ్ కౌన్సిలింగ్ పై నిర్వహించిన సెమినార్ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని తమకు ఉన్న సందేహాలను తీర్చుకున్నారు. ఇక ప్రొఫెసర్ శ్రీనివాసరావు ఇంజనీరింగ్ బ్రాంచ్ లో ఎంపిక, కాలేజీలో ఎంపిక అనే అంశంపై కార్యక్రమం నిర్వహించారు ఈ సెంటర్ లో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని తమకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మరి ఎలాంటి కాలేజీలో ఎంపిక చేసుకోవాలి అనే అంశాలకు సంబంధించి సందేహాలు నివృతి చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో టి న్యూస్‌ , టీన్యూస్‌ సిజిఎం ఉపేందర్, అపెక్స్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఎండి దినేశ్‌కుమార్‌ గట్టు, టీన్యూస్‌ డిజిఎం కిరణ్‌, మార్కెటింగ్‌ టీమ్ సత్యపాల్‌ శ్రీనివాస్‌, భాస్కర్‌, వెంకట్‌రెడ్డి, సతీష్‌, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కళాశాలల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంకా. గోల్డెన్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌- 2021కు ప్లాటినం స్పాన్సర్‌గా మర్రి లక్ష్మణ్‌రెడ్డి, విద్యా సంస్థలు, డైమండ్‌ స్పాన్సర్‌గా సిఎంఆర్‌ విద్యా సంస్థలు, గోల్డ్‌ స్పాన్సర్‌గా మల్లారెడ్డి యూనివర్సిటీ వ్యవహరించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News