Friday, December 20, 2024

ఉత్పాదకతే విద్యా లక్ష్యం

- Advertisement -
- Advertisement -

Education is about Producing... not Consuming

మేధో గుణాలే ఉత్పాదకతా సామర్థ్యానికి మౌలికంగా దోహదం చేస్తాయి. ప్రస్తుత యువతలో స్వీయ -క్రమశిక్షణ, నేర్చుకోవడం పట్ల ప్రేమ, సమాజంపై భక్తి వంటి లక్షణాల పట్ల గౌరవం కొరవడిన నేపథ్యంలో మేధో గుణాలను గురించిన చర్చకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇదే సందర్భంలో మనకో పునశ్చరణ అవసరమవుతున్నది. ఎంత సంప్రదాయస్థులైనా మన తాతలు, తల్లిదండ్రులు విద్యలో ‘వ్యక్త్యభివృద్ధి – సమాజ హితం’ మధ్య గల డైనమిక్ సంబంధాలను అర్థం చేసుకున్నారు. పరిస్థితుల రీత్యా ఆలస్యమైనప్పటికీ వ్యక్తిగత సంతృప్తి, దీర్ఘకాలం మనగలిగే మెరుగైన విద్యావంతుల కుటుంబం, ఆనందకరమైన గృహ సంస్కృతి తద్వారా సుస్థిరాభివృద్ధిని కోరే సమాజాన్ని నిర్మించాలనే కాంక్షను ఆమోదించే కాలీన దృక్పథం మన పెద్దలకుండేది. అయితే ఇది నాటి వాళ్ల కాలంతో మేళవించిన నైతిక సందర్భంతో ముడివడిన విషయం. అందుకనే ఇవాళ్టి విద్యార్థినీ విద్యార్థులకు మేధో ధర్మాలను ఉపాధ్యాయులు తమ బోధనా ప్రణాళికలో జోడించవలసి వుంది.

‘What is a student? A student is one interested in knowing, just because he or she understands that there is so much to learn. A student is one who asks, ‘Do I get to study that? ‘A true student would never say, ‘Do I have to study that? ‘A student is also one who is capable of practicing such intellectual virtues as civility, reflection, clarity, responsibility, patience, and thoroughness‘ Michael Hartoonion
సామాజిక పరిభాషలో అభివృద్ధి, వికాసం రెండూ విశిష్ట పదాలు. ఇవి వైయక్తికం మాత్రమే కాదు, సామాజికం కూడా. విద్యతో మాత్రమే అనుసంధానమైన అభివృద్ధి వికాసాలు. సమాజం రూపాంతరంలో కీలక భాగస్వాములు. దీన్నుంచే విద్యార్థి నుంచి పాఠశాల వెలికితీసే సామర్థ్యాలను, నైపుణ్యాలను తిరిగి ఆ విద్యార్థి సమాజానికి ఇవ్వాలన్న ఆధునిక విద్యా దృక్పథం జనించింది. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ జాన్ ఆమోస్ కొమినస్ విద్యాలయాన్ని సామాజిక సేవల ఉత్పాదకతా కేంద్రంగా అభివర్ణించాడు. ఇట్లా విద్యాలయం రూపొందాలంటే విద్యార్థులకు క్రమశిక్షణ ఉండటం ఎంత ముఖ్యమో నిరంతరం నేర్చుకోవాలనే తపన ఉండటమూ అంతేముఖ్యం. ఈ తపన నుండే ‘సముచిత అభ్యసన ఫలితం (Highest Learning Outcome)’ సాధ్యపడుతుందని కొమినస్ అంటాడు. సమాజ సేవ లక్ష్యంగానే చదవడం, రాయడం నేర్పించడానికి పిల్లల్ని పాఠశాలలో చేర్చుకున్నామన్న మౌలిక స్పృహతో పాటు, ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క విషయాన్ని పరిపూర్ణంగా తెలుసుకునేటట్టు బోధించడం కోసమే కొమెనస్ ‘ద గ్రేడ్ డిడాక్టిక్ (మహా బోధనాశాస్త్రం)’ గ్రంథాన్ని ప్రచురించాడు. అయితే, ఈ దిశగా మన విద్యావిధానం పరివర్తన చెందాల్సి వుంది.
ఏవేవో సాకులతో నీరసం, నిస్తేజం అలుముకున్న మన పాఠశాలలు పిల్లలను సామాజిక నిబద్ధత వైపుకు ప్రేరేపించడంలో వెనుకబడ్డాయన్న విషయాలను అందరం గుర్తెరగాల్సి వుంది. మరి, దిద్దుబాటు ఉపాధ్యాయుల నుండే మొదలు కావాలి. మరీ ముఖ్యంగా ఇరవై ఒకటో శతాబ్దపు విద్యా లక్ష్యమైన ‘జ్ఞాన వినియోగిత నుండి జ్ఞాన ఉత్పాదకత ( Learners need to move from being consumers of information to becoming producers)’ వైపుకు పిల్లలను తీర్చిదిద్దడానికి సంబంధించిన ప్రయత్నాలు చిత్తశుద్ధితో కూడినవై ఉండాలి. పిల్లల్లో మేధో ధర్మాలు (Intellectual Virtues) పాదుకొల్పడానికి పాఠమూ పాఠశాల ఎప్పుడూ ఎక్కడా వెనక్కి తగ్గరాదు.
మేధో గుణాలే ఉత్పాదకతా సామర్థ్యానికి మౌలికంగా దోహదం చేస్తాయి. ప్రస్తుత యువతలో స్వీయ క్రమశిక్షణ, నేర్చుకోవడం పట్ల ప్రేమ, సమాజంపై భక్తి వంటి లక్షణాల పట్ల గౌరవం కొరవడిన నేపథ్యంలో మేధో గుణాలను గురించిన చర్చకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇదే సందర్భంలో మనకో పునశ్చరణ అవసరమవుతున్నది. ఎంత సంప్రదాయస్థులైనా మన తాతలు, తల్లిదండ్రులు విద్యలో ‘వ్యక్త్యభివృద్ధి – సమాజ హితం’ మధ్య గల డైనమిక్ సంబంధాలను అర్థం చేసుకున్నారు. పరిస్థితుల రీత్యా ఆలస్యమైనప్పటికీ వ్యక్తిగత సంతృప్తి, దీర్ఘకాలం మనగలిగే మెరుగైన విద్యావంతుల కుటుంబం, ఆనందకరమైన గృహ సంస్కృతి తద్వారా సుస్థిరాభివృద్ధిని కోరే సమాజాన్ని నిర్మించాలనే కాంక్షను ఆమోదించే కాలీన దృక్పథం మన పెద్దలకుండేది. అయితే ఇది నాటి వాళ్ల కాలంతో మేళవించిన నైతిక సందర్భంతో ముడివడిన విషయం. అందుకనే ఇవాళ్టి విద్యార్థినీ విద్యార్థులకు మేధో ధర్మాలను ఉపాధ్యాయులు తమ బోధనా ప్రణాళికలో జోడించవలసివుంది. ప్రముఖ అమెరికా విద్యావేత్త మైఖెల్ హర్టూనియన్ తన ‘విద్య అనేది ఉత్పాదకత కోసమే, వినియోగ భావన కాదు (Education is about Producing… not Consuming)’ అనే వ్యాసంలో మేధో ధర్మాల ఆవశ్యకతను గురించి ఇట్లా ‘A student is also one who is capable of practicing such intellectual virtues as civility, reflection, clarity, responsibility, patience, and thoroughness. These are the qualities that define the good citizen, the good worker, the good parent, the good scholar, and the kind of individuals who would blow the tops off any test that you care to give them’ ప్రస్తావించారు.’ సభ్యత, ప్రతిఫలనం, స్పష్టత, బాధ్యత, సహనం, పరిపూర్ణత’ ఈ ఆరు మేధో ధర్మాల సముపార్జనలో విద్యార్థికి ఉపాధ్యాయుడు బోధనాపరంగా తగినంత సహకారం ఇవ్వాలని, ఛాత్రు లూ ఉపాధ్యాయుల చెంత సరిపడినంత సమయాన్ని వెచ్చించాలని హర్టూనియన్ చెపుతారు.
వినడానికి చాలా సాధారణమైన పదాలుగా కనిపిస్తున్నప్పటికీ భావనలో, ఆచరణలో మేధో ధర్మాలు అత్యంత సంక్లిష్టమైనవి, గుణాత్మకమైనవి. సభ్యత (Civility)ను పండితులు ‘people treat each other with respect and consideration in the workplace; the organization effectively handles conflicts between stakeholders (workers, customer s, clients, public, suppliers, etc); workers from all backgrounds are treated fairly in our workplace; and the organization has effective ways of addres sing inappropriate behaviour by customers or clients’ అని నిర్వచించారు. ప్రతిఫలనం (Reflection)’ మనుషులుగా మనం మన జీవితంలో కొన్ని పాత్రలలో జీవిస్తాం. అవి మనం ఎదుగుతున్నప్పుడు మనలో ఎల్లప్పుడూ మార్పును కనబరుస్తాయంటూ (As human beings, we inhabit certain roles in our lives which are always changing as we grow into ourselves) తర్కించబడింది. స్పష్టత (clarity) అనేది మానసిక ఆరోగ్యం, సర్దుబాటు, వ్యక్తులు ఒకరికొకరి మధ్య ప్రపంచానికి ప్రతి చర్యలను అర్థం చేసుకోవడంలో ఉపయోగకరమైన మానసిక పరిణతిగా వ్యాఖ్యానించారు. బాధ్యత (Responsibility) అనేది ప్రతి వ్యక్తి నిర్వహించాల్సిన కర్తవ్యం లేదా విధి. సంఘ ప్రయోజనం కోసం ఇతర వ్యక్తులతోనూ సంస్థలతోనూ పని చేయడానికి, సహకరించడానికి ఒక వ్యక్తి అనుసరించే పని విధానంగా సూత్రీకరించబడింది. సహనం (Patien ce) ఆరోగ్యకరమైన వైఖరిని వ్యక్తిలో పెంపొందిస్తుంది. సహనం ఎదురు దెబ్బలను అంగీకరించి జీవితాన్ని మరింత ఆనందించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ‘ఓపికున్నేనిదే ఓరుగల్లు పట్నం’ అని మనకో సామెత వెనకటి నుండి ఉంది. పట్టుదలతో ఉండటానికి, మరింత ఉత్పాదక నిర్ణయాలు తీసుకోవడానికి అనుమతిస్తుంది, సహనమే తరచుగా గొప్ప విజయానికి దారివేస్తుందంటారు విజ్ఞులు. పరిపూర్ణత (Thoroughness) ఒక కార్యానికి సంబంధించిన వ్యక్తి లేదా సామూహిక అమోదయోగ్యమైన కడపటి చైతన్యం (Thoroughness in accomplishing a task through concern for all the areas involved, no matter how small. Monitors and checks work or information and plans and organizes time and resources efficiently)గా వక్కాణించబడింది. సుస్థిరాభివృద్ధి, సుస్థిర భవిష్యత్తు గురించి పంచాయితీ నుంచి పార్లమెంటు దాకా, అదాలత్ నుంచి ఐక్యరాజ్య సమితి దాకా చర్చ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే నిరంతరం నేర్చుకునే సుగుణం, మేధో ధర్మాల సముపార్జనా సామర్థ్యం అలవడితేనే విద్యార్థుల్లో ఉత్పాదకత వెలుగుచూస్తుంది. లేదంటే ఉత్త కస్టమర్లుగానే భవిష్యత్తరం మిగలగలదు.

డా.బెల్లి యాదయ్య, 9848392690

Education is about Producing… not Consuming

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News