Monday, December 23, 2024

విద్యతోనే సామాజిక చైతన్యం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : విద్యా అభివృద్ధి చెందితేనే సామాజిక చైతన్యం అభివృద్ధి చెందుతుందని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవ్ కార్యక్రమాన్ని స్థానిక శ్రీకృష్ణ ప్రసాద్ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్యతిధిగా హాజరైన పోలీస్ కమిషనర్ ముందుగా జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందిస్తున్నారని అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్య అభివృద్ధి చెందితే సంస్కృతి, సామజిక విలువలు, ఆర్థిక ఎదుగుదల సాధ్యమవుతుందన్నారు. కెపియం పాఠశాలలో విద్య అర్హతలు కలిగి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారన్నారు.

వారు విద్య మార్పులకు అనుగుణంగా శిక్షణ తరగతులకు హాజరై ఉత్తమ విద్యను విద్యార్థులకు అందించాన్నారు. అదేవిధంగా పాఠశాలల్లో విద్యార్థులకు గానం, నృత్యం, నాటకం, వ్యాసరచన పోటీలతో పాటు తెలంగాణ కవులు, రచయితల పఠన పోటీలు నిర్వహించి ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆనంతరం పాఠశాల ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్ పర్సన్ హృదయ్ మెనాన్ అడిషనల్ డిసిపి కుమారస్వామి, ఆర్‌ఐ రవి, స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News