Thursday, January 23, 2025

విద్యతోనే సమాజంలో సమున్నత స్థానం

- Advertisement -
- Advertisement -
  • తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్ రెడ్డి

యాలాల: విద్యతోనే సమాజంలో సమున్నత స్థానం దక్కుతుందని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని విశ్వనాథ్‌పూర్ గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ మేరకు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించి, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోని, ఆ దిశగా అడుగు వేయాలని తెలిపారు. సమాజంలో చదువుకున్న వారికే విలువ ఉందని, ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

సమాజంలో విద్యతోనే సమూల మార్పులు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సత్యమ్మ, ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, కోఆప్షన్ సభ్యులు అక్బర్ బాబా, వైస్ ఎంపీపీ రమేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆశన్న, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మాధవ్ రెడ్డి, మధుసుధన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ఆకుల శివ కుమార్, లాలప్ప ముదిరాజ్, ముస్తఫా, ఎంఈఓ సుధాకర్ రెడ్డి, స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News