Monday, December 23, 2024

రిజర్వ్‌డ్ ఉద్యోగాలు వేటిలోనూ రిజర్వేషన్ రద్దు చేయలేదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రిజర్వ్ చేసిన ఉద్యోగాలు వేటిలోను రిజర్వేషన్ రద్దు చేయలేదని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ (ఎంఒఇ) ఆదివారం స్పష్టం చేసింది. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి కేటగరీల నుంచి తగినంత మంది అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో ఆ కేటగరీల కోసం రిజర్వ్ చేసిన ఖాళీని రిజర్వేషన్ లేనిదిగా ప్రకటించవచ్చునని యుజిసి ముసాయిదా మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించిన తరువాత విద్యా మంత్రిత్వశాఖ ఆ వివరణ ఇచ్చింది. ‘ఉన్నత విద్యా సంస్థలు (హెచ్‌ఇఐ)లో కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్ విధానం అమలుకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలు సంబంధిత వ్యక్తుల నుంచి సమాచారం కోసం అందరికీ అందుబాటులో ఉన్నాయి. ముసాయిదా మార్గదర్శక సూత్రాలపై పలు వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.

ఉన్నత విద్యా సంస్థల ఉద్యోగాలలో ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఒబిసిలకు ఇచ్చిన రిజర్వేషన్‌ను నిలిపివేయడానికి ‘కుట్ర’ జరుగుతోందని, దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనుల సమస్యలపై మోడీ ప్రభుత్వం ‘ప్రతీక రాజకీయాలకు’ పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. జెఎన్‌యు విద్యార్థుల యూనియన్ (జెఎన్‌యుఎస్‌యు) కూడా ఆ విషయమై నిరసన నిర్వహించి, యుజిసి చైర్మన్ ఎం జగదీశ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేసింది. గతంలో కేంద్ర విద్యా సంస్థ (సిఇఐ)ల్లో రిజర్వ్‌డ్ కేటగరీ ఉద్యోగాలలో రిజర్వేషన్‌ను రద్దు చేయలేదని, మున్ముందు కూడా ఆ విధంగా రిజర్వేషన్‌ను రద్దు చేయడం జరగదని జగదీశ్ కుమార్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News