Monday, January 20, 2025

విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి కలెక్టరేట్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొడ్డు స్మరణ్, కుమ్మరి రాజ్‌కుమార్. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భూపాలపల్లి మండల తహసీల్దారుకు బుధవారం వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్‌ఎఫ్‌ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ 5 రోజుల పాటు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చేసిన సైకిల్ యాత్రలో వచ్చిన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని, పెండింగ్‌లో ఉన్న మెస్ కాస్మోటిక్ చార్జీలను వెంటనే విడుదల చేయాలని, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రియాంబర్స్‌మెంట్‌లు వెంటనే విడుదల చేయాలని పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని విడుదల చేయాలని అదేవిధంగా గురుకులాలకు స్వంత హాస్టల్ భవనాలు ఏర్పాటు చేయాలని, విద్యార్థులందరికి సకాలంలో బస్సు సౌకర్యం కల్పించాలని కాలేజ్ హాస్టల్స్‌కు సంబంధించి స్వంత భవనాలు ఏర్పాటుచేయాలని తదితర డిమాండ్లతో ఎస్‌ఎఫ్‌ఐ సైకిల్ యాత్ర చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు రిత్విక్, విజయ్, సంఘమిత్ర కాలేజీ కమిటీ సభ్యులు రాజ్‌కుమార్, అశోక్, తరుణ్, దేవరాజ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News