రేగొండ: వృత్తి ధర్మమే ప్రథమ కర్తవ్యంగా భావించిన ఎస్‌ఐ స్థాయి నుండి డిఎస్‌పిగా పొందిన మండల కేంద్రానికి చెందిన ఏడునూతుల రమేష్‌రెడ్డి పదోన్నతి పొందడంతో మండల మాజీ సర్పంచ్ ఏడునూతుల నిషిధర్‌రెడ్డిలు, రేగొండకు చెందిన చిన్ననాటి మిత్రులు, ప్రజలు సంతోషాలు వెలిబుచ్చారు. రమేష్‌రెడ్డి 1996 బ్యాచ్‌లో ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టి పలు జిల్లాలో పని చేశారు. చిన్నతనంలో కూడా కష్టించి చదువుకొని పైకి రావాలనే లక్షంతో ముందకు సాగి వెళుతుండేవాడని పలువురు రమేష్‌రెడ్డి మిత్రులు మోడెం ఉమేష్‌గౌడ్, బండి సమ్మయ్యగౌడ్, నామాని రమేష్, పూజారి బిక్షపతిగౌడ్, తదితరులు పేర్కొన్నారు.
మొదటలో కరీంనగర్ ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆదిలాబాద్, కరీంనగర్, నిజాంబాద్ జిల్లాలో సిఐగా విధులు నిర్వహించి బదిలీపై హైదరాబాద్‌కు వెళ్ళారు. అక్కడే సిఎం చాంబర్‌లో విధులు నిర్వహిస్తూ ఉంటున్న చిన్ననాటి మిత్రులను ఎప్పటికి ఫోన్లు చేసి మంచిచెడులు అడిగేవారని, అందరితో కలిసి మెలిసి చదువుకుంటు డిఎస్‌పిగా పదోన్నతి పొందిన రమేష్‌రెడ్డికి మండల కేంద్రంతో పాటు గ్రామాలకు చెందిన మిత్రులు అభినందనలు తెలిపారు. ఇదే విధంగా రమేష్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని చిన్ననాటి మిత్రులు, బంధువులు సోదరులు గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.