- Advertisement -
హైదరాబాద్: ఫార్ములా- ఈ కార్ రేసింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫార్ములా- ఈ కార్ రేసింగ్ కేసులో కీలక అంశాలను రాష్ట్రం ప్రభుత్వం బయటపెట్టింది. రేసు నిర్వహించిన గ్రీన్ కో కంపెనీ ద్వారా బిఆర్ఎస్ కు కోట్ల రూపాయలు లబ్ధి చేకూరినట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. బిఆర్ఎస్ కు ఎన్నికల బాండ్ల ద్వారా రూ. 41 కోట్లు గ్రీన్ కో చెల్లించినట్టు తెలిపింది. గ్రీన్ కో, అనుబంధ సంస్థలు నుంచి 26 సార్లు బాండ్లు చెల్లించనట్టు సమాచారం తెలిసింది. 2022లో ఏప్రిల్ 8 – అక్టోబర్ 10 మధ్య బాండ్లు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఏప్రిల్ 8న 20 బాండ్లు, అక్టోబర్ 10న 6 బాండ్లు కొన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
- Advertisement -