న్యూఢిల్లీ : నిద్రా సమయంలో మనం తీసుకునే శ్వాస మెదడులోని జ్ఞాపకాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో పరిశోధకులు తాజాగా అధ్యయనం చేశారు. నిద్రా సమయంలో మెదడు లోని ప్రకంపనలకు తిరిగి జ్ఞాపకాలు ప్రేరేపితం కావడానికి సంబంధం ఉందని జర్మనీకి చెందిన పరిశోధకులు స్పష్టం చేశారు. నిద్రలో తీసుకునే ఊపిరికి మేలుకొనే సమయంలో జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోడానికి గల సంబంధాన్ని ఇతర అధ్యయనాలు వెల్లడించినా, శ్వాసక్రియ కూడా నిద్రాసమయంలో జ్ఞాపకాలను కలిగించే ప్రక్రియకు తోడ్పడుతుందని తమ అధ్యయనంలో తేలిందని జర్మనీకి చెందిన ముంచెయన్ యూనివర్శిటీ పరిశోధకులు థామస్ స్క్రీనియర్ వెల్లడించారు.
ఈ అధ్యయనంలో 20 మందిని తీసుకుని పరిశీలించారు. రెండు సెషన్స్‌లో వారికి నిద్రపోయే ముందు 120 బొమ్మలను చూపించారు. వారు దాదాపు రెండు గంటలు పోయిన తరువాత ఆ సమయంలో వారి శ్వాసక్రియతోపాటు మెదడు ఎలా పనిచేసిందో గుర్తించారు. ఈ బొమ్మల్లో కొన్ని పదాలు ఉన్నాయి. వారు మేల్కొన్న తరువాత ఎంతవరకు వారు తిరిగి జ్ఞాపకం చేసుకోగలిగారో గుర్తించారు.