Monday, December 23, 2024

రాష్ట్రంలో సమర్ధవంతంగా శాంతిభద్రతలు

- Advertisement -
- Advertisement -

Effective peacekeeping in the state: Mahmood Ali

హోంమంత్రి మహమూద్ ఆలీ

హైదరాబాద్: రాష్ట్ర పోలీసుశాఖలో యువ పోలీస్ అధికారుల నియామకంతో సమర్థవంతంగా శాంతి భద్రతల పరిరక్షణ జరుగుతోందని హోంమంత్రి మహమూద్ ఆలీ పేర్కొన్నారు. నగరంలోని సిపిఎల్ అంబర్‌పేట్ వద్ద పోలీస్ ట్రాన్ స్పోర్ట్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం నాడు నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ దేశంలోనే పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున పోలీస్ నియామకాలను చేపట్టడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రికార్డ్ సృష్టించిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే మొదటి దశలో 28, 500 పోలీస్ నియామకాలు పూర్తి చేశామని, కొత్తగా మరో 17500 నియామకాల ప్రక్రియ పురోగతిలో ఉందని గుర్తుచేశారు. రాష్ట్రంలో పోలీస్ అధికారులు, సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత నిస్తున్నామని దీనిలో భాగంగా రాష్ట్రంలో పెట్రోల్ బంక్ లు, ఫంక్షన్ హాళ్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని సంక్షేమానికై ఉపయోగిస్తున్నట్టు హోం మంత్రి వివరించారు.

నూతనంగా ప్రారంభించిన సిపిఎల్ అంబర్‌పేట్ పెట్రోల్ పంప్ తో సహా మొత్తం నాలుగు పెట్రోల్ పంప్ లను ఏర్పాటు చేశామని, వీటి ద్వారా పోలీస్ శాఖ ట్రాన్స్‌పోర్ట్ విభాగం పై ఒత్తిడి తగ్గుతోందన్నారు. ఫ్రెండ్లి పోలీసింగ్,సమర్ధవంతమైన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, మహిళా భద్రతా విభాగం ఏర్పాటు, కొత్త పోలీస్ కమిషనరేట్‌లు, జిల్లా పోలీస్ కార్యాలయాలు, డిఎస్‌పి, సర్కిల్, పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో పోలీస్ శాఖ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తోందని తెలియచేసారు. పెట్రోబంక్ లను ఏర్పాటు చేయడంలో ప్రత్యేక కృషి చేసిన అడిషనల్ డిజి సంజయ్ జైన్ ను, పిటివొ ఎస్.పి.రాజేష్ ను మంత్రి మహమూద్ అలీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డిజిపి ఎం.మహేందర్ రెడ్డి, అడిషనల్ డిజిపిలు జితేందర్, సంజయ్ కుమార్ జైన్, జాయింట్ సిపిలు కార్తికేయ, రమేష్ రెడ్డి, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఎస్.పి. రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News