Friday, January 10, 2025

అధునిక ఎస్‌సిటిపిలతో సమర్థవంతంగా ఘన వ్యర్థాల నిర్వహణ

- Advertisement -
- Advertisement -

Effective solid waste management with advanced SCTP

 

మన తెలంగాణ /సిటీ బ్యూరో: గ్రేటర్‌లో సమగ్ర ఘనవ్యర్థాల నిర్వహణకు జిహెచ్‌ఎంసి శ్రీకారం చుట్టింది. నగరంలో వెలువడుతున్న మున్సిపల్ ఘన వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు గాను భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రాథమిక స్థాయిలో వ్యర్థాల డంపింగ్, తరలింపుకు సంబంధించి కొత్తగా అత్యాధునిక సెకండరీ ట్రాన్స్‌ఫర్ స్టేషన్లు(ఎస్‌టిసి)లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్ వ్యాప్తంగా 6 జోన్లలో అన్ని సర్కిళ్లలో 3 చోప్పున కొత్తగా 90 సెకండరీ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ మంత్రి కె.తారక రామారావు ఆదేశాలకు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ 2016 నిబంధలన మేరకు జిహెచ్‌ఎంసి అత్యాధునిక సెకండరీ కలెకక్షన్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్లను నిర్మిస్తోంది. ఇందుకు నగరంలో అతి తక్కువ విస్తీర్ణంలో అనువైన ప్రాంతాల్లో ఈ ఎస్‌టిసిలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ గత ఏడాదిన్న కిత్రం ప్రణాళికలను సిద్దం చేసిన అధికారులు వీటి నిర్మాణాలను ప్రారంభించారు. అయితే కొన్ని ప్రాంతాల్లో స్థల సమస్యలు రాగా, మరికొన్ని చోట్ల స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో సెకండరీ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రతిపాదించిన 90 సెకండరీ ట్రాన్స్‌పర్ సు స్టేషన్లలోఇప్పటీ వరకు 24 ప్రాంతాల్లో అత్యాధునిక ట్రాన్స్‌పర్ స్టేషన్ల ఏర్పాటు పూర్తి కాగా, 72 మొబైల్ ఎస్‌సిటిపిలు ద్వారాసేకరించిన ఘన వ్యర్థాలను నేరుగా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.

వికేంద్రీకరణతో సమర్థవంత నిర్వహణ

సెకండరీ కలెకక్షన్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్లు ( ఎస్‌సిటిపి)లను వికేంద్రీకరించడం ద్వారా సమర్థవంతంగా ఘన వ్యర్థాల నిర్వహణ సాగుతోంది. ఎస్‌టిపిలు తక్కువలో తక్కువ 1000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం ద్వారా ప్రాథమిక స్థాయిలో సేకరించిన ఘన వ్యర్థాలను వెంటవెంటనే అత్యాధునిక పోర్టబుల్ సెల్ప్ కంపాక్టర్ , స్టాటిక్ కంపాక్టర్లు, భారీ వాహనాలు, క్లోజ్డ్ కంటైనర్లు, హుక్ మౌంట్ వాహనాలతోపాటు రిప్యూజ్డ్ కంటైనర్ వాహనాల(ఆర్‌సివి)లలో నేరుగా డంప్ చేయడం మూలంగా తరలింపు ప్రక్రియ వేగవంతమైంది.24 అత్యాధునిక ఎస్‌సిటిపిలతో పాటు యాంత్రిక పద్దతిలో మరో 72 రిప్యూజ్ కంటైనర్ వాహనాల(ఆర్‌సివి) ద్వారా నిర్వహిస్తున్న సెకండరీ కలెక్షన్ పాయింట్‌లను మొబైల్ ఎస్‌టిపిలుగా పరిగణిస్తున్నారు. మొబైల్ ఎస్‌సిటిపిలకు సంబంధించి మొత్తం 72 ఆర్‌సివి వాహనాల్లో 49 జిహెచ్‌ఎంసి వాహనాలు కాగా 23 రీల్ సంస్థకు చెందినవి ఉన్నాయి. మొబైల్ ఎస్‌సిటిపిలను సర్కిల్ స్థాయిలో అనువైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతో మెరుగైన పద్దతిలో ఘన వ్యర్థాల నిర్వహణ సాధ్యపడింది.దీంతో రోజు రోజుకు పెరగుతున్న ఘన వ్యర్థాల సేకరణ, తరలింపు ప్రక్రియ తక్కువ వనరులతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా శానిటేషన్ నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న స్వచ్చ అవార్డుల్లో బల్దియా సెల్ఫ్ సస్టేనేబుల్ ఆవార్డును సొంతం చేసుకుంది. ఇదే క్రమంలో ఎస్‌సిటిపిల నిర్మాణానికి సంబంధించి త్వరితగతిన స్థలాలు గుర్తించి వాటి నిర్మాణాలను పూర్తి చేసేందుకు తగిన చర్యలను తీసుకోవాలన్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశాలతో అధికారుల ప్రక్రియను మరింత వేగవంతం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News