Saturday, December 21, 2024

రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం

- Advertisement -
- Advertisement -

నర్సంపేట: ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై బిఆర్‌ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నర్సంపేటలోని వరంగల్ రోడ్డు కూడలిలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనలో భాగంగానే ఇలాంటి ప్రకటన చేశారని, తెలంగాణ రైతన్నకు 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.

గతంలో విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మరోసారి తన రైతు వ్యతిరేక విధానాలను బయట పెట్టిందన్నారు. దీనిని తెలంగాణ రైతాంగం, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, పట్టణ కార్యదర్శి వెన్నముద్దల శ్రీధర్‌రెడ్డి, బిఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మినుముల రాజు, కౌన్సిలర్లు జుర్రు రాజు, ఎండీ పాషా, గందె రజిత, చంద్రమౌళి, గోల్యానాయక్, గ్రంథాలయ డైరెక్టర్ పుట్టపాక కుమారస్వామి, ఉపాధ్యక్షుడు పెరుమాండ్ల ప్రభాకర్‌రెడ్డి, పెండ్యాల యాదగిరి, రాయరాకుల సారంగం, ప్రచార కార్యదర్శి మండల శ్రీనివాస్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ చాంద్‌పాషా, షేక్ ఇర్ఫాన్, వార్డు అధ్యక్షులు పెరుమాండ్ల రవి, సంపంగి సాలయ్య, గుండెబోయిన కోటి, బీరం నాగిరెడ్డి, రావుల సతీష్, అప్పాల సుదర్శన్, రచ్చ రఘు, దోనాల రవి, పల్నాటి సాంబయ్య, మద్దెల సాంబయ్య, విద్యార్థి విభాగం అధ్యక్షుడు దేవోజు హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News