Wednesday, January 22, 2025

రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

- Advertisement -
- Advertisement -

కూసుమంచి : పాలేరు ఎమ్మెల్యే అందాల ఉపేందర్ రెడ్డి నాయకత్వంలో బుధవారం కూసుమంచి మండల కేంద్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమెరికాలో చేసిన ప్రకటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ పిలుపు మేరకు కూసుమంచి మండల కేంద్రంలో పిసిసి అధ్యక్షుడు దిష్టిబొమ్మ దహనం అనంతరం నాయకన్ గూడెం గ్రామ రైతువేధిక నందు నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అనంతరం రేవంత్ రెడ్డి, దిష్టిబొమ్మను బిఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులతో కలిసి దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News