సిద్దిపేట: టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ నాయకులు గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హోసింగ్ బోర్డ్ నుంచి బీజేఆర్ చౌరస్తా వరకు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా దిష్టి బొమ్మ శవయాత్ర నిర్వహించి, దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, గుండు శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ… మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవలేక.. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర పన్నిందన్నారు. బీజేపీ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వారు అన్నారు. కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ పెట్టడంతో బిజెపికి భయం పట్టుకుందన్నారు. దేశం బిఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నది అని విమర్శించారు.
టిఆర్ఎస్ ఎమ్మెల్యే లు.. పార్టీ ఆత్మగౌరవంగా కమిట్ మెంట్ గా ఉండే నాయకత్వం గల పార్టీ చిల్లర రాజకీయాలు చేసి అమ్ముడు పోయే పార్టీ కాదని ఎద్దేవా చేసారు. అధికార దాహంతో అంధకారంలో బీజేపీ ప్రజాస్వామ్యంతో పరిహాసం చేస్తే ప్రజలు తరిమి కొడతారన్నారు. ఆత్మ గౌరవ, ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ బీజేపీ ప్రలోభాలకు ఎమ్మెల్యేలు లొంగరుని స్పష్టం చేశారు. బిజెపి పార్టీకి తెలంగాణ ప్రజలు గోరి కడతారు అది మునుగోడు నుండే బిజెపి దేశంలో పతనం అవుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్స్ , పట్టణ టి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు , మహిళ నాయకులు , యూత్ , విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.