Tuesday, January 21, 2025

దేశంలో గిరిజనులపై దాడులకు కుట్ర: హేమంత్ సోరెన్

- Advertisement -
- Advertisement -

రాంచి: దేశంలో గిరిజనులపై దాడి చేసేందుకు కుతత్రాలు జరుగుతున్నాయని, ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే మణిపూర్ ఘటనలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆరోపించారు. తమ ఉనికి కోసం గిరిజనులు పోరుబాట పట్టాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన తెలిపారు. రెండు రోజుల జార్ఖండ్ ఆదివాసీ మహోత్సవ్ ముగింపు సందర్భంగా శుక్రవారం ఆయన ప్రసంగిస్తూ సమాజంలో గిరిజనుల ఉనికి కోసం సర్నా అనే ఒక ప్రత్యేక మతాన్ని రాజ్యాంగంలో పొందుపరచాలని కోరుతూ జార్ఖండ్ ప్రభుత్వం అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఆమోదించిందని, దేశంలో తమ ప్రభుత్వం ఒక్కటే ఈ పనిచేయగలిగిందని చెప్పారు.

గిరిజనుల కన్నా తక్కువ జనాభా ఉన్న చాలా కులాలకు ప్రత్యేకమైన గుర్తింపులు ఉన్నాయని, గిరిజనులకు మాత్రం వారికంటూ విడిగా గుర్తింపు ఎందుకు ఉండకూడదని ఆయన ప్రశ్నించారు. దేశంలోని దాదాపు 13 కోట్ల మంది గిరిజనులకు సొంత గుర్తింపు ఉండాల్సిందేనని ఆయన అన్నారు. కేంద్రంలో గిరిజనల వ్యవహారాల మంత్రిత్వశాఖ విడిగా ఉన్నప్పటికీ గిరిజనులను మాత్రం గుర్తించడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవని ఆయన చెప్పారు. గిరిజనులను కొందరు వనవాసీ అని పిలిస్తే మరికొందరు జన్‌జాతి అంటారని, వనవాసీలు గిరిజనులు కాదని అనడం సబబు కాదని ఆయన అన్నారు.

గిరిజనులపై దాడులు చేసేందుకు ఒక కుట్ర జరరుగుతోందని, దేశంలోని అనేక ప్రాంతాలలో వారిపై దాడులు జరుగుతున్నాయని సోరెన్ అన్నారు. మణిపూర్‌లో ఏం జరుగుతోందో అందరూ చూస్తున్నారని, బ్రిటిష్ పాలనలో ఆ ప్రాంతానికి వలస వెళ్లిన గిరిజనులు ఇప్పుడు జార్ఖండ్‌కు తిరిగివస్తున్నారని, అలా వచ్చే వారందరికీ ఆశ్రయం కల్పిస్తున్నామని జెఎంఎం నాయకుడు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News