Monday, December 23, 2024

లెండి ప్రాజెక్టు పనుల పూర్తికి కృషి

- Advertisement -
- Advertisement -

ప్రాజెక్టును సందర్శించిన ప్రొఫెసర్ కోదండరామ్

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో 36 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ‘లెండి ప్రాజెక్టు’ ను టిజెఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు 1984 సంవత్సరంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించారని తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్‌బి. చౌహాన్, ఉమ్మడి ఎపి ముఖ్యమంత్రి ఎన్‌టి. రామారావు మధ్య ఒప్పందం జరిగి 1987 లో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించినట్లు తెలిపారు. సారవంతమైన భూములు కోల్పోయిన రైతులకు పునరావాసం కోసం అందోళనలు చేయడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులు పెండింగ్ లో పెట్టిందన్నారు. 2003లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో నూతన అంచనా వ్యయాలపై ఒప్పందం కుదురిందని, ఈ ప్రాజెక్టు అయ్యే ఖర్చులు మహారాష్ట్ర 62శాతం, ఉమ్మడి రాష్ట్ర వాటా 38 శాతం నిధులు ఖర్చులు చేయాలనీ ఒప్పందo జరిగిందన్నారు.

ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి పునరావాసం కలుపుతూ మొత్తం రూ. 800 కోట్లు కావాలని, ఈ ప్రాజెక్టు మొత్తం 14 గేట్లు ఉన్నాయని, 8 సంవత్సరాల క్రితం 10 గేట్లు పూర్తి చేసారని, ఇంకా 4 గేట్లు పెండింగ్ లో ఉన్నాయని కోదండరామ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 6.36 టిఎంసి లు కాగా తెలంగాణకు వాటా 3.63 టిఎంసిలు, 23 వేల ఎకరాలతో జుక్కల్ నియోజకవర్గం పరిధిలో మద్నూర్, బిచ్చుకుందా మండలలో రైతులకు సాగు నీరు అందించవచ్చని తెలిపారు.

ఈ ప్రాజెక్టు కుడి కాలువ తెలంగాణ రాష్ట్రం లోకి వస్తుందని, మొత్తం 19 కిలోమీటర్ల మేర కామన్ కెనాల్ సుమారుగా 8 కిలోమీటర్ల మేర అండర్ పైపు లైన్ నిర్మాణ పనులు అంటే మద్నూర్ మండలం సరిహద్దు వరకు మహారాష్ట్ర ప్రభుత్వం పనులు పూర్తి చేయాలనీ అంగీకారం కుదిరిందని తెలిపారు. ఈ రెండు రాష్ట్రల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాజెక్టు పెండింగ్ లో పడిందన్నారు. తెలంగాణలో 25 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువకు పనులు 1100 ఎకరాల భూమి అవసరం ఉందని, 11 పిల్ల కాలువలో 8 మాత్రమే పూర్తి చేశారని తెలిపారు. సర్వే చేసి 8 ఏళ్లు గడిచినా పనులు పెండింగ్ లో ఉన్నాయని గత తెలంగాణ ప్రభుత్వం లెండి ప్రాజెక్టు గురించి కనీసం పట్టించు కోలేదని విమర్శించారు.

తెలంగాణ ప్రభుత్వంలో మిత్ర పక్షంగా ఉన్న తాము ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి లెండి ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యేవిధంగా కృషి చేస్తామని చెప్పారు. ఈ లెండి ప్రాజెక్టు పూర్తి అయితే మహారాష్ట్ర రైతులకు తెలంగాణ రైతులకు సాగు నీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిజెఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. నిజ్జన రమేశ్, మెడికల్ ఇంఛార్జి డిఆర్. శంకర్, డిపి. రెడ్డి, జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్, జుక్కల్ నియోజకవర్గ నాయకులు సబ్ డే చందు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు తుల్జ రెడ్డి, రమేశ్ రెడ్డి, హన్మంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Kodandaram

Kodandaram

Lendi Project

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News