Wednesday, January 22, 2025

ప్రతి కాలనీలో మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటుకు కృషి

- Advertisement -
- Advertisement -

గచ్చిబౌలి : నియోజకవర్గం పరిధిలోని ప్రతి కాలనీలో మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్‌మోహర్ పార్క్ కాలనీలో 50 లక్షల రూపాయల అంచన వ్యయంతో నూతనంగా చేటపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణం పనులకు స్థానిక డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకంలో మంత్రి కెటిఆర్ సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ని ప్రతి కాలనీని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు.

అదే విధంగా ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందు లు కలుగకుండా ప్రతి కాలనీలో మెరుగైన రవాణ వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేస్తూ సుఖవంతమైన ప్ర యాణానికి బాటలు వేస్తామని అన్నారు. అదే విధం గా నియోజకవర్గం పరిధిలోని ప్రతి కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తూ అభివృద్ధికి కృషి చే స్తానని, నూతనంగా చేపట్టే సిసి రోడ్డు నిర్మాణం ప నుల్లో ఎటువంటి జాప్యం లేకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈసందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మాదాపూ ర్ డివిజన్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యా దవ్, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ, శ్రీను పటేల్, తి రుమలేష్, శ్రీనివాస్, రామేశ్వరమ్మ, కుమారి, గుల్ మోహర్ పార్క్ కాలనీ అధ్యక్షుడు షేక్ ఖాసీం, జనరల్ సెక్రటరీ నిరంజన్ రెడ్డి, జాయింట్ సెక్రటరి పేన్తోజీ, వెంకటేశ్వర్లు, ఈ సి మెంబర్ అశోక్, మాజీ జనరల్ సెక్రటరి చారీ, అడ్వైజర్ బషీర్ అహ్మద్, షేక్ రహేజా, సమీర్, రవి కుమార్, సాయిబాబా, నర్సయ్య, రామారవు, అలీఖా న్, సాయి అంజయ్య, దుర్గా, విల్సన్ మరియు కా లనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News