Wednesday, November 6, 2024

కరీంనగర్ ను ఆదర్శ నియోజకవర్గంగా నిలిపేందుకు కృషి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: కరీంనగర్ నియోజకవర్గాన్ని తెలంగాణలోని ఆదర్శ నియోజకవర్గంగా నిలిపేందుకు ధృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలంలోని చర్లబూత్కూర్, చామనపల్లి గ్రామాల్లో సుమారు 7 కోట్లతో చేపట్టనున్న అభివృద్ది పనులను ఎంపిపి లక్ష్మయ్య,కరీంనగర్ ప్యాక్స్ చైర్మెన్ శ్యాం సుందర్‌రెడ్డితో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ బుధవారం భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు.

తొలుత చర్లబుత్కూర్‌లో చేరుకున్న మంత్రి గంగుల, చర్లబూత్కూర్ పోచమ్మ వాగు నుండి ప్రశాంత్ నగర్ కాలనీ మీదుగా దుబ్బపల్లి వరకు 4 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బిటి రోడ్డు పనులకు భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. చామన పల్లి-, బహదూర్ ఖాన్ పేట్ మధ్యలో కోటి రూపాయలతో నిర్మించనున్న బ్రిడ్జీ నిర్మాణం పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం చామన పల్లి ఎస్సీ కాలనీలో 45 లక్షలతో రహదారి పునరుద్దరణమ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మరో 95 లక్షలతో చామనపల్లి నుండి చాకుంట బిటి రోడ్డు కల్వర్ట్ పనులకు భూమిపూజ నిర్వహించారు.

అంతే కాకుండా చామన పల్లిలో గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ కోసం మంత్రి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.ఈ సంతర్భంగా మంత్రి మాట్లాడుతూ పనులను నాణ్యతతో చేపట్టి త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు కాంట్రాక్టర్ కు సూచించారు.

చర్లబూత్కూర్- ఐత్రాజ్ పల్లి రోడ్ డ్యామ్ పై బ్రిడ్జీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలంటూ అధికారులను ఆదేశించారు. పనులను నాణ్యతతో చేపట్టి అందుబాటులోకి తీసుకు రావాలని అధికారులకు, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహించరాదంటూ సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరీంనగర్ తో పాటు నియోజకవర్గంలోని గ్రామాల్లో సైతం మట్టి రోడ్డు అనేది కనిపించకుండా సిసి, బిటీ రోడ్లను నిర్మిస్తున్నామన్నారు. భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కురుస్తున్న వర్షాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఎలాంటి విపత్తు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని గ్రామగ్రామాన మట్టి రోడ్డు అనేది కనిపించకుండా సిసి, బిటి రోడ్లు నిర్మిస్తున్నా మన్నారు మంత్రి గంగుల. మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు.

సియం కెసిఆర్ సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి కరీంనగరాన్ని హైదరాబాద్ తర్వాత రెండవ గొప్ప నగరంగా తీర్చిదిద్దామని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంమలో మార్కెట్ కమిటీ చైర్మెన్ రెడ్డవేణి మధు,మండల పార్టీ అధ్యక్షులు శ్యామ్ సుందర్ రెడ్డి,ఎంపిపి తిప్పర్తి లక్ష్మయ్య, ఎంపిటీసిల ఫోరమ్ అధ్యక్షులు బుర్ర తిరుపతిగౌడ్, సర్పంచ్ లు దబ్బెట రమణారెడ్డి,సర్పంచ్ బొగొండ లక్ష్మీ అయిలయ్య, పురుమళ్ళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News