Friday, December 20, 2024

గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి

- Advertisement -
- Advertisement -
  • కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

మేడ్చల్: గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని ఎల్లంపేట, సోమారం, సైదోనిగడ్డ తండా, రావల్ కొల్ గ్రామాలలో శుక్రవారం మంత్రి మల్లారెడ్డి పర్యటించి ఆయా గ్రామాలలో ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు.

సొంత నిధులతో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ పనులు చేయిస్తానని, కుల సంఘాల భవనాల నిర్మాణానికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. సొంత నిధులతో నిర్మాణం చేపట్టబోయే పలు సీసీ రోడ్లు, కుల సంఘాల భవనాల నిర్మాణ పనులకు భూమి పూజలు చేసి ఆలయాలలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వంలో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని అన్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికి నీటిని అందించడంతోపాటు హరితహారంలో భాగంగా గ్రామాలను హరిత గ్రామలుగా మార్చామని అన్నారు. గ్రామాల్లో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణన్ని కల్పించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, జిల్లా రైతుబంధు అధ్యక్షులు నారెడ్డి నందారెడ్డి, ఎంపిపి రజిత రాజమల్లారెడ్డి, జడ్పిటిసి శైలజ విజేయందర్‌రెడ్డి, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News