Monday, December 16, 2024

శాఖల సమన్వయంతో అభివృద్ధికి కృషి

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్

హుస్నాబాద్: మండలంలోని ప్రభుత్వ అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తూ హుస్నాబాద్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. సోమవారం పట్టణంలోని స్థానిక ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపిపి లకావత్ మానస అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించగా జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి తోకలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హుస్నాబాద్ మండలం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాకనే అన్ని శాఖలకు అభివృద్ధి పనుల కోసం అవసరమైన నిధులు కేటాయించుకున్నామని తెలిపారు. నిధుల సద్వినియోగంతో గ్రామాల రూప రేఖలు మారడంతోపాటు నిరంతరం అభివృద్ధి కొనసాగుతుందని తెలిపారు.

హుస్నాబాద్ మండలంలో కొన్ని గ్రామాలను కలపడం వల్ల ఎంపిటిసి స్థానాలు పెరిగాయని అన్నారు. మండలంలోని గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించడం జరుగుతుందని అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి పరుస్తామన్నారు. అనంతరం పలు గ్రామాల అభివృద్ధి, సంక్షేమంపై చర్చించి, గ్రామాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండలంలోని గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News