Sunday, December 22, 2024

ప్రణాళిక బద్ధంగా కాలనీల అభివృద్ధికి కృషి

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు: ప్రణాళిక బద్ధంగా కాలనీల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చెప్పారు. పటాన్ చెరు జిహెచ్‌ఎంసి పరిధిలోని సింఫోని కాలనీలో రూ. 42 లక్షల వ్యయంతో వేస్తున్న సిసి రోడ్డు పనులను కాలనీ వాసులతో కలసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ఏర్పాడుతున్న నూతన కాలనీలకు ప్రాధాన్యత ఇస్తు అభివృద్ధి చేస్తున్నట్టుగా చెప్పారు. గతంలో కాలుష్యానికి మారుపేరుగా ఉన్న పటాన్‌చెరు ఏరియా నేడు గ్రేటర్ కమ్యునిటీలకు అడ్డాగా మారిందన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో వందలాది గ్రెటేడ్ కమ్యూనిటీ కాలనీలు ఏర్పడుతున్నాయన్నారు.

ప్రజలకు మెరుగైన వసతులు కల్పించే విషయంలో తాను ముందు వరుసలో ఉన్నానన్నారు. పాటాన్‌చెరు ప్రాంతంలో ఇల్లులు కొనుక్కోవడానికి సాఫ్ట్‌వేరు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారని చెప్పారు.ఇప్పటి వరకే ఆల్వీన్ కాలనీ నుంచి సింఫోని కాలనీ వరకు రూ. 3 కోట్లతో సిసి రోడ్డు పనులను పూర్తి చేయడమైనదన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, కాలనీ సంక్షేమ సంఘం సబ్యులు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News