పెద్దపల్లి: ఎస్సీ, ఎస్టీ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ త్వరితగతిన పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అధికారుల కమిటీ సభ్యులు, పోలీసులను ఆదేశించారు. శుక్రవారం ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అట్రాసిటీ కేసులు, బాధితులకు నష్టపరిహారం చెల్లింపులపై చర్చించారు. జిల్లాలో 97 కేసులకు ప్రభుత్వం 70.95 లక్షల పరిహారం మంజూరు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 56 మంది బాధితులకు రూ.35 లక్షల పరిహారం అందించామని, మిగిలిన 33.95 లక్షల పరిహారం పెండింగ్‌లో ఉందని అధికారులు తెలిపారు. పోలీస్ చార్జిషీట్ ప్రకారం పెండింగ్ లేకుండా వెంట వెంటనే పరిశీలన చేసి, పూర్తి చేయాలన్నారు.
జిల్లాలోని పెద్దపల్లి ఏసీపీ వద్ద 14, గోదావరిఖని ఏసీపీ వద్ద 16 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, కోర్టులో 165 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే ప్రతి నెల 30వ తేదిన పౌరహక్కుల దినోత్సవం నిర్వహించాలని, ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను వివరించాలని కలెక్టర్ తెలిపారు.
సమావేశం అనంతరం విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జిల్లాలోని పలు మున్సిపాలిటీలలోని పారిశుద్య కార్మికులకు శానిటేషన్ భద్రత పరికరాలు కల్పించి కార్మికులతో పనులు చేయించేలా చూడాలని, అలాగే రామగుండం సోషల్ వెల్ఫేర్ గురుకుల రెసిడెన్షియల్ కాలేజీ నుండి ఎస్టీ కాలనీ వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, కాలేజికి మిషన్ భగీరథ నీరు సౌకర్యం కల్పించాలని తదితర సమస్యలపై కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
ఈ సమావేశంలో అధికారులు వీరబ్రహ్మచారి, నాగలేశ్వర్, ఏసీపీ ఎడ్ల మహేష్, సీఐ సతీష కరీంనగర్ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పవన్ కుమార్, కమిటీ సభ్యులు సూర వెంకటేశం, మధునయ్య, రాజ్ కుమార్, సాయిరాం, ఎన్‌జీఓలు రాజయ్య, రాజగోపాల్, దివాకర్‌రావు, సెక్షన్ అధికారి డీటీ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.