Monday, December 23, 2024

బేడ బుడగ జంగాల అభివృద్ధికి కృషి

- Advertisement -
- Advertisement -

తొర్రూరు : బేడ బుడగ జంగాల అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య ఆధ్వర్యంలో బేడ బుడగ జంగాల కులస్తులతో కలిసి హన్మకొండలో మంత్రి దయాకర్‌రావును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ బేడ బుడగ జంగం కుల సంఘం నాయకుల కోరిక మేరకు ఆ కులస్తులు శుభకార్యాలు, వివాహాలు చేసుకోవడానికి తొర్రూరు డివిజన్ కేంద్రంలోని అమ్మాపురం రోడ్డులో ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం స్థలాన్ని కెటాయించడం జరిగిందన్నారు. ఫంక్షన్ హాల్ నిర్మాణానికి రూ.రెండు కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ అన్ని కులాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. అందరూ సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News