Thursday, January 23, 2025

బీరప్ప ఆలయాల అభివృద్ధికి కృషి : ఇంద్రకరణ్‌ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కురుమల కులదైవమైన శ్రీబీరప్ప స్వామి ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. శ్రీబీరప్ప స్వామి ఆలయాల అభివృద్ధికి నిధుల కేటాయింపుపై శాసనమండలిలో ఎంఎల్‌సి యెగ్గే మల్లేశం అడిగిన ప్రశ్నకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 46 శ్రీ బీరప్ప స్వామి ఆలయాల అభివృద్ధికి రూ.7.38 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా దేవాదాయ శాఖలో రిజిస్ట్రరై ఉండి బీరప్ప ఆలయాల్లో అర్చకత్వం చేస్తున్న అర్హులైన వారికి దూప దీప నైవేద్య పథకం వర్తింపజేసే ప్రతిపాదనను పరిశీలిస్తామని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News