Tuesday, December 24, 2024

గొల్ల, కురుమల ఆర్థికాభివృద్ధికి కృషి

- Advertisement -
- Advertisement -

గద్వాలటౌన్: గొల్ల, కురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం సత్ఫలితాలిస్తూ లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నింపుతోందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నా రు. రెండో విడుత గొర్రెల పంపిణీలో భాగంగా కేటిదొడ్డి మండల పరిధిలోని సుల్తాన్‌పురం గ్రామానికి మంజూరైన 6 యూనిట్ల గొర్రెలను సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గత ప్రభుత్వాలు గొల్ల, కురుమలను పట్టించుకోలేదని, కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గొర్రెలు పంపిణీ చేసి ఉపాధి కల్పిస్తామన్నారు. గొల్ల, కురుమల అభివృద్ధికి ఎంతో తోడ్పాటనందిస్తున్న సిఎం కెసిఆర్ గొల్ల, కురుమల తరపున కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేటిదొడ్డి జడ్పీటీసీ రాజశేఖర్, వైస్ ఎంపీపీ రామకృష్ణనాయుడు, సుల్తాన్‌పురం సర్పంచు రాజు, బీఆర్‌ఎస్‌మండలాధ్యక్షుడు ఉరుకుందు, మండల పశువైద్యాధికారి డాక్టర్ వినయ్, నా యకులు చక్రధర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News