- Advertisement -
పెద్దపల్లి: జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం తనవంతు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే నివాసంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో టీడబ్లు జేఎఫ్ జిల్లా అధ్యక్షుడు పోగుల విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుంక మహేష్, రాష్ట్ర కార్యదర్శి పైడాకుల భిక్షపతి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఫణి సుదర్శన్, జిల్లా ఉపాధ్యక్షులు మారం తిరుపతిరెడ్డి, జాయింట్ సెక్రటరీ సాబీర్ పాషా, వీరేశం, చంద్రమౌళి, ఓంకార్ గౌడ్, సబ్బు సతీష్, గోపికృష్ణ, సుమన్, పరమేష్, వినోద్, సంతోష్, ముహిద్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు.
- Advertisement -