Wednesday, January 22, 2025

పచ్చదనం పరిరక్షణకు కృషి చేయాలి

- Advertisement -
- Advertisement -

డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం

కొండాపూర్: సిఎం కెసిఆర్ వానలు వాపస్ రావాలి సంకల్పంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నేడు ప్రతి పట్టణం, పల్లెలు పచ్చదనంతో మంచి గాలితో అందంగా కనిపిస్తున్నాయని డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం అన్నారు. సోమవారం కొండాపూర్ మండల పరిధిలోని గిర్మాపూర్ గురుకుల పాఠశాలలో సర్పంచ్ నిర్మళతో కలిసి ఆయన మొక్కలు నాటారు. అనతంరం కొండాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి తనవంతుగా అండగా ఉంటానని మండల వైధ్యాధికారి అరుణ, రేష్మ అంజుమ్‌కు పట్నం మాణిక్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్ష రుపాయల నగదును అందజేశారు. తొగర్‌పల్లిలో పసక పండగ నిర్వహించేందుకు క్రైస్తవ సోదరుల కోరిక మేరకు సిలువ ప్రతిష్ఠాపన కోసం ఆయన వైఎస్‌ఆర్‌సిపి జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మనోజ్‌రెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షుడు మల్లేశం, ఎంపిడిఓ జయలక్ష్మి, సర్పంచ్ రుక్మోద్దీన్, నాయకులు ప్రేమానందం, రవి తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News