Thursday, November 21, 2024

మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి చేయాలి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ మాదకద్రవ్యాల వైపు ఆలోచన వస్తే మన తల్లితండ్రులను గుర్తు చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ పట్ల ఆకర్షితులు కావద్దని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని అదనపు కలెక్టర్, డీసీపీ వైభవ్ గైక్వాడ్‌తో కలిసి అమర్ చంద్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ యువత మంచి, చెడు తెలుసుకొని క్రమశిక్షణతో మెలగాలని, అప్పుడే నిర్దేశించుకున్న లక్షాన్ని సాధిస్తారని అన్నారు. అనంతరం చెడుకు అల వాటు పడిన యువతపై పలు అంశాలతో కూడిన ప్రదర్శనలు విద్యార్థులు ప్రదర్శించారు. మనపై పెట్టుకున్న ఆశలు నెరవేర్చకపోతే తల్లితండ్రులు పడే ఆవేదనను కళ్లకు కట్టినట్లుగా చూపించారు.

నేడు సమాజంలో చదువుకున్న యువతే చెడు మార్గాల వైపు దృష్టి మళ్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా సంక్షేమాధికారి రవూఫ్‌ఖాన్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తన ప్రాణ స్నేహితులు రోడ్డు ప్రమాదంలో మర ణించారని, ఎంతో మంచి భవిష్యత్ ఉన్న వారు మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే జీవితాన్ని కోల్పోతారనే సత్యాన్ని గ్రహించాలని కోరారు.

అంతకు ముందు సాంస్కృతిక సారథి కళాకారులు, సఖీ టీం ద్వారా యువత చెడు, తప్పుడు మార్గాల వైపు వెళ్లకుండా సందేశాత్మక ప్రదర్శనలు చేశా రు. అనంతరం మాదక ద్రవ్యాల నివారణ, డ్రగ్స్ నివారణ కోసం రూపొందించిన పోస్టర్లను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు రవూఫ్ ఖాన్, ప్రమోద్ కుమార్, స్వప్న, రమాదేవి, చారి, పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News