Monday, December 23, 2024

జనాభ పెరుగుదల నియంత్రణకు కృషి చేయాలి

- Advertisement -
- Advertisement -
  • సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి

మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో: జనాభ పెరుగుదలను నియంత్రించేందుకు ప్రజల్లో మరింత చైతన్యం తీసుకు రావాల్సిన అవసరం ఉందని సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. మంగళవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్బంగా సంగారెడ్డిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ జనాభాను నియంత్రించాలని, నియంత్రణ లేక పోతే అనార్థాలు జరుగుతాయన్నారు. ఆహారం ఆవాసం ఆరోగ్యం విద్య ఉపాధి మొదలగు ప్రజల అవరాలన్నీ కూడ కొరతకు గురి అవుతాయన్నారు. జనాభాను స్థిరీకరించేందుకు ఆశ కార్యకర్తలు, మహిళ సంఘాలు ప్రజా సంఘాలు ముందుకు రావాలని కోరారు.

పురుషులు కుటుంబ నియంత్రణ అపరేషన్ చేసుకోవాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర సగటులో పాలుపంచుకుంటుందని ఈ సందర్భంగా ఆశభావాన్నీ వ్యక్తం చేశారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి గాయత్రీ దేవీ మాట్లాడుతూ జిల్లాలో అంతర ఇంజక్షన్ కాపర్‌టీ ద్వారా తాత్కాలిక పద్ధతిని మహిళల కోసం విస్త్రృతంగా ప్రచారం చేసి అవగాహన కల్పిస్తామన్నారు. మాల ఎన్‌ఛాయా లాంటి నోటి మాత్రలు కూడ పంపిణీ చేస్తున్నామన్నారు. త్వరలో సంగారెడ్డి జిల్లాలోని అన్ని డివిజన్‌లలో కుటుంబ నియంత్రణ శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు. కుటుంబ నియంత్రణలో ఉత్తమ సేవలందించిన కొండాపూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి రేష్మఅంజుమ్,రాయికోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్ వైజర్ చంద్రశీల, స్టాఫ్ నర్స్ సుమీల, వనజ, లావణ్య తదితరులకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టాటస్టికల్ అధికారి శ్రీనివాస్‌బాజీ,డిప్యూటీ డిఎంఅండ్ హెచ్‌ఓ నాగ నిర్మల, మాస్ మీడియా అధికారి ప్రసాద్ వీరకుమార్, సిబ్బంది సుందరి, సుధాకర్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News