Monday, November 25, 2024

బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి

- Advertisement -
- Advertisement -

ధర్మపురి: వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలని జగిత్యాల జిల్లా ఎస్పీ ఎగ్గిడి భాస్కర్ అన్నారు. ఎస్పీ గురువారం ధర్మపురి పోలీస్ స్టేషన్‌ను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్ ఆవరణలోని వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, రిసెఫ్షన్, స్టేషన్ రైటర్ గది, ఎస్‌హెచ్‌ఓ విశ్రాంతి గది, లాక్ అప్ గదిని ఆయన పరిశీలించారు.

అలాగే కోర్టు విధులు నిర్వహించే అధికారుల గదిలో రికార్డులు భద్రపరచుట, 5ఎస్ అమలు తీరును పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏఏ విధులు నిర్వహిస్తున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూకోట్స్ పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ ఎన్ని బీట్స్ నడుస్తున్నాయని తెలుసుకున్నారు. నిత్యం పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.

డయల్ 100 కాల్ రాగానే వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరించాలన్నారు. బ్లూకోట్స్ పెట్రోల్ కార్ నిరంతరం గస్తీ నిర్వహించాలని, సిబ్బందికి కేటాయించిన గ్రామాల పూర్తి సమాచారం వారి వద్ద ఉండాలని, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజల ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. గ్రామాలలో సిసి కెమరాల ఏర్పాటు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలతో పాటు యువతను అప్రమత్తం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి సిఐ రమణమూర్తి, ఎస్సై దత్తాత్రి, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News