- Advertisement -
మహబూబ్‌నగర్ బ్యూరో : మత్తు పదార్థాలను నివారించేందుకు ప్రతి ఒ క్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని రెవె న్యూ అడిషనల్ కలెక్టర్ మోహన్‌రావు అన్నా రు. మంగళవారం ఐడిఓసి కార్యాలయ వీడి యో సమావేశ మందిరంలో నిర్వహించిన మత్తు పదార్థాల నివారణ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో మాట్లాడుతూ గాంజా ఇతర మత్తు పదార్థాల వల్‌ల యువత పాడైపోవడమే కాకుండా కుటుంబాలు సైతం ఎన్నో ఇబ్బందులకు గురవుతాయని, అందువల్ల జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో గంజా, మత్తు పదార్థాల రవాణా, సరఫరా వంటివి నూటికి నూరు శాతం అరికట్టాలని తెలిపారు.
గాంజా ఏ రూపంలో ఉన్న ఉక్కుపాదంతో అణిచివేయాలని ఆయన అన్నారు. ఏఎస్పీ రాములు, జిల్లా పరిషత్ సిఈఓ జ్యోతి, డిఎస్పీ మహేష్, డిసిబి డిఎస్‌పీ జి. వి. రమణారెడ్డి, ఎస్పీ అవినాష్‌ఆర్య, జిల్లా ఇంటర్ అధికారి వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
- Advertisement -