Monday, December 23, 2024

మీసేవ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మంత్రి హరీశ్‌

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: మీ సేవ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హరీశ్‌రావు హమీనిచ్చారు. గురువారం బిఆర్‌ఎస్ పార్టీకి మద్దుతుగా హైదరాబాద్‌లో మంత్రి నివాసంలో మంత్రి హరీశ్‌రావును కలిసి విరాళాన్ని మీసేవ ఆపరేటర్లు అందజేశారు. సిద్దిపేట జిల్లా మీ సేవ ఆపరేటర్ల ఆధ్వర్యంలో తెలంగాణ మీ సేవ సిద్దిపేట అసోసియేషన్ యూనియన్ ప్రారంభించామని సిద్దిపేట అసోసియేషన్ యూనియన్ అధ్యక్షుడు గందె నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పని చేస్తున్నామని ప్రజలకు ఎటుంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సర్వీసు చేస్తున్నామని కానీ మీ సేవ ఆపరేటర్లు ఎదుర్కోంటన్న సమస్యలపై మంత్రి హరీశ్‌రావుకు వివరించారు.

కులం, ఆదాయం మీసేవ సంబంధించిన సర్వీసుల మీసేవ ధరఖాస్తు చేసి సంబంధిత డాక్యుమెంట్‌లు ఆఫీసులకు స్కాన్ చేసి పంపడం జరుగుతుంది. కానీ కొన్ని డిపార్ట్‌మెంట్ అధికారులు మళ్లీ ఫిజికల్ కాఫీలు కావాలంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇంకా పలు రకాల సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే మంత్రి హరీశ్‌రావు స్పందించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎంఎస్‌ఎ అధ్యక్షుడు నాగరాజు, ఉపాద్యక్షుడు యూసుఫ్, అడెపు మహేశ్, తోట శ్రీకాంత్ , వెంకట్, నవీన్ ,బాబు, ఆంజనేయులు,మంతపురి చంద్రం, ఆశోక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News