Wednesday, January 22, 2025

అతిఖ్ భార్యను, అష్రఫ్ బావమరిదిని అరెస్టు చేసే ప్రయత్నాలు తీవ్రతరం!

- Advertisement -
- Advertisement -

ప్రయాగ్‌రాజ్: ఇటీవల పోలీసుల రక్షణలోనే హత్యకు గురైన అతిఖ్ అహ్మద్ భార్య షాయిస్తా పర్వీన్‌ను, అష్రఫ్ బావ మరిది సద్దామ్‌ను అరెస్టు చేసేందుకు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్‌టిఎఫ్) చర్యలను ముమ్మరం చేశారు. ప్రయాగ్‌రాజ్ వివిధ ప్రదేశాలు, గ్రామాల్లో పోలీసు టీమ్‌లు రెయిడ్స్ చేపట్టాయి. వారెక్కడ ఉన్నారనేది కనుగొనడానికి వారి బంధువుల ఇళ్లలో కూడా రెయిడ్స్ చేశారు.

ఇప్పటికే అతిఖ్ అహ్మద్, అతడి తమ్ముడు అష్రఫ్‌లను చంపేశారు. అతిఖ్ కుమారుడు అసద్ అహ్మద్‌ను ఏప్రిల్ 13న ఝాన్సీలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎన్‌కౌంటర్ చేశారు. ఇదిలావుండగా లాయర్ ఉమేశ్ పాల్‌ను ఫిబ్రవరి 24న హత్య చేసిన ప్లాన్‌లో వివరాలు తెలుసుకునేందుకు అతిఖ్ భార్య షాయిస్తను పట్టుకుని విచారించారించాలని పోలీసులు చూస్తున్నారు. ఉమేశ్ పాల్ హత్య కేసులో షాయిస్త ఫిబ్రవరి 24 నుంచే పరారీలో ఉంది. ఆమెపై రూ. 50000 రివార్డు కూడా ప్రకటించారు. ఆమె తన కుమారుడి అంత్యక్రియలకు ఏప్రిల్ 15న కూడా హాజరు కాలేదు. అలాగే తన భర్త, మరిది అంత్యక్రియలకు కూడా ఏప్రిల్ 16న హాజరు కాలేదు.

షాయిస్తా కోసం పోలీసులు తెగ వెతుకుతున్నారు. ‘గత 48 గంటల్లో కౌశంభీ జిల్లాకు చెందిన బరెథ, మరియాదీహ్, హత్వా ప్రాంతాల్లో, అలాగే ప్రయాగ్‌రాజ్‌లోని రాజ్రుప్పుర్, చకియా, కసరి మసరి, బంరౌలి ప్రాంతాల్లో కూడా వెతికారు. షాయిస్త తండ్రి ముహమ్మద్ హరూన్ ఇంట్లో కూడా వెతికారు. అది ప్రయాగ్‌రాజ్‌కు చెందిన కసరి మసరిలో ఉంది’ అని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. లాయర్ ఉమేశ్ పాల్‌ను ఏరివేయడంలో షాయిస్త పాత్ర కూడా ఉందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. అతిఖ్ జైలుకు వెళ్లినప్పటి నుంచి అతడి ఆర్థిక వ్యవహారాలన్నీ షాయిస్తనే చూసుకుంటున్నారు. ఆమె వద్ద మూడు ఆయుధాలకు లైసెన్సులు ఉన్నాయని సమాచారం. అతిఖ్ ప్రోద్బలంతోనే ఆమె బిల్డర్లు, ట్రేడర్ల నుంచి డబ్బు రాబట్టేదని పోలీసులు తెలిపారు. న్యాయవాది ఉమేశ్‌పాల్ , అతడి ఇద్దరు పోలీసు గార్డులను చంపేసేందుకు ఆమె డబ్బు ఇచ్చిందని ఆరోపణ. దాపెట్టమని ఆమె తన సేవకుడు రాకేశ్‌కు ఇచ్చిన రూ. 72 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. షాయిస్త మీద ధూమాన్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి 24న నాలుగో కేసు నమోదయింది. ప్రయాగ్‌రాజ్‌లోని సులేమ్ సరాయ్ ప్రాంతంలో ఉమేశ్ పాల్‌ను, అతడి ఇద్దరు పోలీస్ గార్డులను కాల్చి చంపిన కేసులో ఈ నాలుగో కేసు నమోదయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News