Saturday, January 11, 2025

ఉపాధి కల్పనకు కృషి

- Advertisement -
- Advertisement -

సదాశివనగర్ : సదాశివనగర్ మండలం యాచారం గిరిజన గ్రామాల్లో శుక్రవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురెందర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఉత్తునూర్ గ్రామానికి చెందిన కార్తిక్‌ను పరామర్శించారు, ప్రమాదవశాత్తు చనిపోయిన బాక్యా సోని కుటుంబ సభ్యులను, బానోత్ జానుబాయ్, బానోత్ సోనీబాయ్,మాలోత్ మధు కుటుబాలను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆయన నిరుపేద కుటుంబంలో చదువుకున్న ఒకరిద్దరికి ప్రభుత్వ ప్రైవేట్ కంపనీలలో ఉపాధి కల్పించడానికి కృషి చేస్తానన్నారు. దురదృష్టవశాత్తు జరిగిన సంఘటల వల్ల ఆ కుటుంబాలు మనో ధైర్యం కోల్పోవద్దని చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు శ్రీనివాస్ నాయక్, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పడిగెల రాజేశ్వర్ రావు, మండల అద్యక్షుడు మహెందర్ రెడ్డి, గైని రమేష్, మాలోత్ రమేష్, సురెందర్ రాధోడ్, పరమేష్ గుప్తా తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News