Monday, December 23, 2024

బిజెపిని నష్టపరిచే ప్రయత్నం : విజయశాంతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిజెపి ధర్నాలు, అరెస్టులన్నీ బిజెపి, బిఆర్‌ఎస్ మధ్య అవగాహనతో కూడిన డ్రామాలని ఇతర రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయని ఇది బిజెపిని నష్టపరిచే యత్నమని ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి అన్నారు. దీనిపై కొందరు మీడియా మిత్రులు హౌస్ అరెస్టులో ఉన్న తనను కూడా ఫోన్ ద్వారా ప్రశ్నలు అడిగారని ఆమె పేర్కొన్నారు. అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ బిజెపిని నష్టపరిచే ప్రయోగాలు, ప్రచారాలు ఎన్నో విధానాలుగా చేస్తూనే ఉన్నారన్నది వాస్తవమని ఈ అవగాహన ప్రశ్న పై, మమ్మల్ని అడిగినట్లే, ముఖ్యమంత్రిని కూడా అడగాలని చెప్పారు. కాదు, బిజెపిని మాత్రమే బలి కా బక్రా చేస్తామనడం సమంజసం కాదని అన్నారు. ఏది ఏమైనా, బిజెపి తన సైద్ధాంతిక పంథాలో ఎప్పుడైనా కొనసాగుతూనే ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News