Wednesday, January 22, 2025

గ్రామ దేవతల ఆలయాల అభివృద్ధికి కృషి

- Advertisement -
- Advertisement -

కీసర: గ్రామ దేవతల ఆలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం చీర్యాల్ గ్రామంలో శ్రీమల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి రూ.5 లక్షలు, బీరప్ప ఆలయ అభివృద్ధి కి రూ.5 లక్షలు విరాళాన్ని ప్రకటించిన మంత్రి మేరకు తనను కలిసిన గ్రామస్తులకు రూ.4 లక్షల నగదును అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తన సొంత నిధులు వెచ్చిస్తూ గ్రామాలలో సిసి రోడ్లు, ఆలయాలను అభివృద్ధ్ది చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బెస్త వెంకటేష్, ఎంపీపీ మల్లారపు ఇందిర లక్ష్మీనారాయణ, సర్పంచ్ తుంగ ధర్మేందర్, మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు జలాల్‌పురం సుధాకర్‌రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి సభ్యులు పూలగూర్ల శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News