Thursday, January 23, 2025

మున్సిపాలిటీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి

- Advertisement -
- Advertisement -
  • చైర్‌పర్సన్ ముల్లి పావని

ఘట్‌కేసర్: మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ద్ధికి కౌన్సిల్ సమిష్టిగా కృషి చేస్తుందని చైర్‌పర్సన్ ముల్లి పావని తెలిపారు. ఘట్‌కేసర్ మున్సిపాలిటీ 3వ వార్డు పరిధిలో స్థానిక కౌన్సిలర్ బొక్క సంగీతరెడ్డి సొంత ఖర్చులతో వార్డులో విద్యుత్ సమస్యల పరిష్కారాన్ని బుధవారం చైర్‌పర్సన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీలో దశల వారీగా మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

వార్డులో ప్రజా సమస్యల పరిష్కారానికి సొంత ఖర్చులతో ప్రత్యేక చొరవ తీసుకోవడం పట్ల కౌన్సిలర్ సంగీతరెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, కమిషనర్ వేమన రెడ్డి, కౌన్సిలర్లు బండారి అంజనేయులు గౌడ్, నాయకులు ముల్లి జంగయ్య యాదవ్, బొక్క ప్రభాకర్ రెడ్డి, బొక్క జంగారెడ్డి, బొక్క సుధాకర్ రెడ్డి, కొట్ట నర్సింహా రెడ్డి, వాకిటి ప్రవీణ్ రెడ్డి, సిబ్బంది తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News