Monday, December 23, 2024

విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేలా కృషి

- Advertisement -
- Advertisement -

గణతంత్ర వేడుకల్లో టిఎస్ ఎస్‌పిడిసిఎల్ సిఎండి

మన తెలంగాణ / హైదరాబాద్ : నిర్దేశిత లక్ష్యాలను చేరుకుంటూ విద్యుత్ వినియోగదారులకు మరింతగా మెరుగైన సేవలు అందించేలా ప్రతి ఒక్కరు పట్టుదలతో పని చేయాలని టిఎస్ ఎస్‌పిడిసిఎల్ సిఎండి ముషారఫ్ ఫరూఖీ, ఐఏఎస్ అన్నారు. ఈ మేరకు గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కారక్రమానికి సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ, ఐఏఎస్ ముఖ్య అతిధిగా పాల్గొని మన దేశ జాతీయ జెండా ఆవిష్కరించారు. సంస్థ ఉద్యోగులకు, సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో, సంస్థ డైరెక్టర్లు టి.శ్రీనివాస్, జె.శ్రీనివాస రెడ్డి, కె.రాములు, జి.పర్వతం, సిహెచ్.మదన్ మోహన్ రావు, ఎస్.స్వామి రెడ్డి, జి.గోపాల్, సివిఓ శ్యామ్ బాబు, చీఫ్ జనరల్ మేనేజర్లు, సూపెరింటెండింగ్ ఇంజినీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News